వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర అనేక  ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతోంది.  ప్రజా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌టానికి మాత్ర‌మే కాకుండా   జ‌నాల‌తో క‌లిసి న‌డ‌వ‌టం వ‌ల్ల వారితో ఆత్మీయ‌త‌ను పంచుకుంటున్నారు. వారి ద్వారా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున‌న్నారు.   పాద‌యాత్ర‌లో నియోజ‌క‌వ‌ర్గాల్లోని పార్టీ ప‌రిస్దితిని స‌మీక్షిస్తున్నారు.  నేత‌ల మ‌ధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు.  రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల్సిన అభ్య‌ర్ధుల‌ను కూడా కొన్ని చోట్ల నిర్ణ‌యిస్తున్నారు. మ‌రికొన్ని చోట్ల  అభ్య‌ర్ధుల‌ను కూడా ప్ర‌క‌టించేస్తున్నారు. 


ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు


ఇప్పుడిదంతా ఎందుకంటే, తూర్పుగోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల మధ్య విభేదాల‌పై దృష్టి పెట్టారు.  నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌లు ముర‌ళీరాజు, ప‌ర్వ‌త ప్ర‌సాద్ మధ్య గొడ‌వ‌లు  జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చింది.  క‌త్తిపూడి క్రాస్ రోడ్డు నుండి మొద‌లైర పాద‌యాత్ర సంద‌ర్భంగా ముర‌ళీరాజు మేన‌ల్లుడిపై ప‌ర్వ‌త ప్ర‌సాద్ చేయి చేసుకున్నారు. దాంతో ముర‌ళీ ఏర్పాటు చేసిన స్వాగ‌త బెలూన్లు, పోస్ట‌ర్ల‌పై ఎక్క‌డా ప్ర‌సాద్ ఫొటో గానీ పేరు గానీ క‌న‌బ‌డ‌లేదు. 


ఇద్ద‌రికీ క్లాస్ పీకిన జ‌గ‌న్


ఎప్పుడైతే విష‌యం జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చిందో వెంట‌నే అదే రోజు రాత్రి ఇద్ద‌రు నేత‌ల‌ను జ‌గ‌న్ త‌న శిబిరానికి పిలిపించుకున్నారు. కాకినాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కన్వీన‌ర్ కుర‌సాల క‌న్న‌బాబు స‌మ‌క్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. నేత‌లిద్ద‌రికీ జ‌గ‌న్ ఫుల్లుగా క్లాస్ పీకారు. విభేదాలు వీడ‌క‌పోతే జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని వివ‌రించారు. ఇద్ద‌రినీ విభేదాలు ప‌క్క‌న‌బెట్టి పార్టీ ప‌టిష్టానికి కృషి చేసేలా ఒప్పించారు. దాని ఫ‌లితంగా చాలా కాలంగా ఉప్పు నిప్పులా ఉన్న పై ఇద్ద‌రు నేత‌లు త‌ర్వాత జ‌గ‌న్ తో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: