తమిళనాడు రాజకీయ దిగ్గజం.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  చెన్నై విమానాశ్రయం నుంచి కేసీఆర్ నేరుగా కరుణానిధి భౌతికకాయం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్.. కేసీఆర్‌ను కరుణ పార్థివదేహం వద్దకు తీసుకెళ్లారు. 


భారత రాజకీయ రంగానికి కరుణానిధి మరణం తీరనిలోటు అన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ అవగాహన కలిగించిన కొద్దిమంది నేతల్లో కురుణానిధి ఒకరని పేర్కొన్నారు. కరుణానిధి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయనకు కేసీఆర్ నివాళి అర్పించారు. 


కేసీఆర్ వెంట ఎంపీ కవిత ,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.  బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కరుణానిధి భౌతికకాయం ఉంచిన రాజాజీ హాల్‌కు వెళ్లారు. కరుణానిధి కుటుంబసభ్యులను పరామర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: