రాజకీయాలలో మేరు నగధీరుడైన కరుణానిధి ఎందరినో నాయకులుగా తయారు చేశారు ఆయనే ఓ రాజకీయ విశ్వవిద్యాలయంగా వెలిగిపోయారు. ఆయన చలవతో ఎందరో మంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఆయన వద్దనే కుమారులూ రాజకీయ ఓనామాలు దిద్దారు. అళిగిరి, స్టాలిన్ కరుణ వారసులుగా తెర ముందుకు వచ్చినప్పటికీ ఆయన మాత్రం స్టాలిన్ సామర్ధ్యానికే ఓటు వేశారు. తన ఇద్దరు బిడ్డలలో రేపటి రోజున తమిళ సీమను ఏలే సీఎం స్టాలిన్ అని భావించారు. తన ముద్దుల కొడుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని కలలు కన్నారు.


అలా  దెబ్బేసిన అన్న :



కరుణా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అటువంటి అవకాశం ఒకటి వచ్చింది. 2006 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అప్పటికే వయోభారంతో ఉన్న కరుణ తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ని సీఎం పీఠం ఎక్కించాలనుకున్నారు. సరిగ్గా  కధ ఇక్కడే అడ్డం తిరిగింది. అన్న అళిగిరి అలిగారు. కూడదన్నారు. దాంతో డీఎంకే లోనే చీలిక వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీన్ని గమనించిన  కరుణ దాదాపు ఎనభయ్యేళ్ళ వయసులో మరో మారు సీఎం పీఠం ఎక్కాల్సి వచ్చింది.



డిప్యూటీగానే :



సీఎం చేద్దామనుకున్నా కుటుంబ రాజకీయాల వల్ల కుదరకపోవడంతో తనయుడు స్టాలిన్ ని డిప్యూటీ సీఎం గా చేసి కరుణ త్రుప్తి పడాల్సి వచ్చింది. 2016లో మరో సారి అధికారం డీఎంకేకి అందీ అందకుండా పోయింది. ఈసారి ఖాయం అనుకున్న చోటనే మళ్ళీ అళగిరి దెబ్బేశాడు. ఇండైరెక్ట్ గా ఆయన జయలలితకు హెల్ప్ చేయడంతో వంద వరకూ సీట్లు వచ్చినా డీఎంకే పరాజయం పాలు కావాల్సివచ్చింది అప్పట్లో  కనుక డీఎంకె అధికారంలోకి వచ్చుంటే కచ్చింతంగా స్టాలిన్ సీఎం అయ్యేవాడు. కరుణ కోరికా తీరేది. ఏదేమైనా తమిళ పెద్దాయన ఆశ అలా నెరవేరకుండానే కన్నుమూయాల్సివచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: