ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించ గలిగిన నేత. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అగ్ర నేత కు ఉంటూ ఎన్నో మంత్రి పదవులు స్వీకరించాడు, కానీ ఇప్పడూ పరిస్థితి మారింది. కాంగ్రెస్ కు ప్రజలు చావు దెబ్బ కొట్టడంతో ఆనం పరిస్థితి ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయ్యింది. టీడీపీలో చేరినప్పుడు పదవులపై ఆశలు పెట్టుకున్న ఈయనకు ఇప్పటివరకైతే జగన్‌ ఎలాంటి ఆశలు కల్పించలేదంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరాలన్నారు.

Image result for anam ramanarayana reddy

ఇది ఇబ్బందికరమే అయినా వేరే మార్గం లేదనుకున్నారు ఆనం. తనకు  ఆత్మకూరు టిక్కెట్టు కావాలని అడిగితే  ఇది సాధ్యం కాదన్నారు జగన్‌. అక్కడ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లోనూ అతనే పోటీ చేస్తాడు కాబట్టి ఈయన్ని వెంకటగిరి నుంచి పోటీ చేయాలని చెప్పారు. ఒక ఆశ నిరాశ అయింది. వైకాపా అధికారంలోకి వస్తే  తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

Image result for anam ramanarayana reddy

కాని జగన్‌ ఆ విషయంలో హామీ ఇవ్వలేదు. ఇప్పుడే మంత్రి పదవి కోసం హామీ ఇస్తే పార్టీలో నిరసన తలెత్తే అవకాశముందని జగన్‌ భావించాడేమో. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత రీతిలో గౌరవిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఇలా రెండు ఆశలూ నెరవేరలేదు. బీజేపీలో ఉన్న ఈయన వైకాలోకి  వెళ్లాలనుకుంటున్నాడని తెలిసి ఈమధ్యనే నాయకత్వం ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టినా వైకాపాలో చేరడానికి సిద్ధమయ్యాడు. తాను ఎలాంటి షరతులు లేకుండా వైకాపాలో చేరతానని చెబుతున్నప్పటికీ వెంకటగిరి మీద కన్నేశాడు.  మరి అతనికి ఆ నియోజకవర్గంపై జగన్‌ హామీ ఇచ్చాడో లేదో తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: