ఆమె కధలో రాజకుమారిలా రాజ ప్రాసాదాలలో గడిపే యువరాణి. ఆమె లోకం ఇప్పటివరకూ వేరు. మరి ఇపుడు మాత్రం అసలు కధలో నేనే రాణీ అంటోంది. ఆమె విజయనగర సంస్థానాధీశుడు పూసపాటి వారి నవతరం వారసురాలు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారాల పట్టి. పేరు అదితి గజపతిరాజు. ఆమె తన తండ్రి రాజకీయ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారట.  ఎన్నికలలో పోటీకి నేను రెడీ అంటోంది కూడా.


అక్కడ నుంచే :


వచ్చే ఎన్నికలలో అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీకి దిగుతారని టాక్. ఇక్కడ నుంచే అశోక్ పలుమార్లు గెలిచి కొన్ని దశాబ్దాల పాటు  రాజకీయాలను శాసించారు. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసి  కేంద్ర మంత్రి అయ్యారు. వచ్చే ఎన్నికలలో తనకు బదులుగా కూతురుని పోటీకి దించాలని అశోక్ భావిస్తున్నారు. 


లెక్కలు సరిపోతాయా :


అశోక్ ని అసెంబ్లీ నుంచి కదపడం కోసమే చంద్రబాబు తెలివిగా స్కెచ్  వేసి మరీ 2014లో ఎంపీగా డిల్లీకి పంపారు అని అంటారు.  అలా విజయనగరం కేంద్రంగా అశోక్  సుదీర్ఘమైన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయింది.  అక్కడ నుంచి కాపు సామజికవర్గం నాయకురాలు మీసాల గీతకు  పోయిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.  ఈసారి కూడా ఆమె పోటీకి రెడీ అంటున్నారు. ఆమెను కాదని అగ్ర కులానికి చెందిన అదితికి బాబు టికెట్ ఇస్తారా, కోరి కాపులతో కొరివి పెట్టుకుంటారా అన్నదే ఇక్కడ పాయింట్.


 అంతే కాదు, పూసపాటి వారి రాజకీయానికి తెర వేసేసిన బాబు  మరో  తరాన్ని ప్రోత్సహించి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకుంటారని కూడా టాక్ నడుస్తోంది  అశోక్ ఇదే విషయమై బాబు ని సంప్రదిస్తే  అదినేత ఏమీ హామీ ఇవ్వలేదని భోగట్టా.  దానికి బట్టి అదితి ఫ్యూచర్ ఎలా అన్నది అశోక్ డిసైడ్ చేసుకోవాలి. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: