ఎపుడూ తనకు అనుకూలమైన, తెలివైన రాజకీయమే చేస్తారు. ప్పంతా ఎదుటి వారిపై తోసేసి తాను మాత్రం గ్రేట్ అంటారు. ఈ రోజు పాడేరులోనూ అదే చేశారు. ఓ వైపు బాక్సైట్ పై అగ్గి రాజుకున్న టైంలో దాన్ని చల్లార్చకుండా చలి కాచుకునే ప్రయత్నమే చేశారు. అమాయకులైన గిరిజనులను  ఉబ్బేస్తూనే ప్రత్యర్ధులపై బురదంతా చల్లేసారు. ఇవాల్టి సంగతి చెప్పకుండా పాత కాలం స్టోరీలు చెప్పి మెల్లగా తప్పుకున్నారు. అభిమానం ఇస్తే ప్రాణం పెట్టే మన్యం జనం బాబు కధలు విని ఊ కొట్టారో లేదో  తరువాత తెలుస్తుంది కానీ ఇప్పటికైతే  ఏజెన్సీ నట్టింటికి వచ్చి కూడా బాక్సైట్ పై క్లారిటీ ఇవ్వకుండా బాబు వెళ్ళడం విశేషం.

అనాడలా చేశారట :


బాక్సైట్ గనుల తవ్వకాలకు కేంద్రం ఒకే చెప్పిన వేళ మీ స్టాండ్ ఏంటో చెప్పు బాబూ అంటూ ఓ వైపు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, వామపక్షాలు ఈ రోజు విశాఖలో బ్లాక్ డే పాటించాయి. దాంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో, పోలీస్ బందోబస్త్ తో విమానం నుంది దిగీ దిగగానే పాడేరు కు వెళ్ళిన బాబు అక్కడ గిరి కధలు బాగానే  చెప్పారు. వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, ఇష్టానుసారంగా ఒప్పందాలు చేసుకున్నారని పాడేరు మీటింగులో చంద్రబాబు విమర్శించారు. తాను సీఎం అయ్యాక బాక్సైట్ అనుమతులు  రద్దు చేశానని చెప్పుకున్నారు. 


అంతా బాగానే ఉంది, కానీ  మరి లేటెస్ట్ గా కేంద్రం నాల్కోకు బాక్సైట్ గనుల తవ్వకాలను అప్పగించాలనుకుంటోంది, బాబు సర్కార్ గతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ  జారీ చేసిన జీవో 97  ఇప్పటికీ రద్దు కాలేదు, దీని మాటేంటో చెప్పకుండానే బాబు ప్రసంగం ముగించడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. 

క్లారిటీ ఏదీ :


తాను ఎట్టి పరిస్థితులలోనూ బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుమతించనని బాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. గతంలో అప్పటి ప్రభుత్వాలు   బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చినా ప్రజా ఉద్యమాలకు వెను తిరిగాయి, మరి ఇపుడు మళ్ళీ ఆ గనుల తవ్వకాలకు రెడీ అంటూ కేంద్రం దూసుకువస్తూంటే బాబు ఎందుకు కిమ్మనరని ప్రశ్నిస్తున్నారు. తప్పంతా ఎదుటివారిపై తోసేసి రాజకీయం చేస్తున్నారని విపక్షాలు అటాక్ చేస్తున్నాయి. మరి బాబు ఇప్పటికైన క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: