చంద్ర బాబు ఎప్పుడు మైకు తీసుకున్న తన నోటిలోనుంచి వచ్చే మొదటి పదం నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది మరీ ప్రతి పక్షానికి ఏముందని , నిజమే బాబు కు 40 ఏళ్ల అనుభవం ఉంది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఆ 40 ఏళ్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగ పడిందా లేదన్నదే అసలైన విషయం. ప్రత్యేక హోదా విషయం లో బాబు దారుణంగా విఫలమయ్యాడు. పైపెచ్చు అస్సలు ప్రత్యేక హోదా అవసరమే లేదని చెప్పాడు. 

Image result for chandrababu naidu

2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. నిన్న మొన్నటిదాకా మిత్రపక్షాలుగా మెలిగాయి. కానీ, కేసీఆర్‌లో నరేంద్రమోడీకి కన్పించిన మెచ్యూరిటీ, చంద్రబాబులో కన్పించకపోవడమే ఆశ్చర్యకరం. మోడీ అవసరార్ధమే కేసీఆర్‌ని పొగిడినా, చంద్రబాబు అసమర్థతని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. సాటి తెలుగు రాష్ట్రం నుంచి చంద్రబాబు, ప్రత్యేకహోదా విషయమై మద్దతు కూడగట్టలేకపోవడమే చంద్రబాబు అసమర్థతకి నిలువెత్తు నిదర్శనం.

Image result for chandrababu naidu

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో అయినా చంద్రబాబు, విపక్షాల తరఫున టీఆర్‌ఎస్‌ని ఒప్పించి వుంటే, ఈక్వేషన్‌ ఇంకోలా వుండేదేమో...! 2019లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలని చంద్రబాబు ఆలోచిస్తోంటే.. అంతకన్నా రాజకీయ దిగజారుడుతనం ఇంకోటుండదు.. తెలుగుదేశం పార్టీకి అది ‘ఆత్మహత్య’ లాంటిదే. చంద్రబాబు సైతం తన రాజకీయ జీవితానికి తనంతట తానే చరమగీతం పాడుకున్నట్లవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: