నన్ను గెలిపించండి, దండీగా ఓట్లు వేయండి, మిగతా సంగతి నేను చూసుకుంటాను, ఇదీ చంద్రబాబు ప్రతి మీటింగులో తొంబయి శాతం పైగా చెబుతున్న మాట.  పేరుకే ప్రభుత్వ కార్యక్రమాలు, అక్కడ మాత్రం తెలుగుదేశం ఎన్నికల ఉపన్యాసాలు, చాలాకాలంగా బాబు ఇదే చేస్తూ పోతున్నారు. నిజానికి ప్రభుత్వం అంటే రాజకీయాలు ఉండకూడదు,  సీఎం అన్న వ్యక్తికి  పార్టీ రంగులు అంటూ ఉండవు, కానీ బాబు మాత్రం ప్రభుత్వ ప్రోగ్రాం అంటూ చెప్పి అక్కడ ఫక్త్ పొలిటికల్ స్పీచులే ఇస్తున్నారు.


అధికార దుర్వినియోగం :


సీఎం వస్తున్నారంటే చాలు అంతకు ముందు వారం రోజులూ, ఆ తరువాత మరో నాలుగు రోజులూ అధికార యంత్రాంగం ఆ పేరుతో బిజీ అయిపోతోంది. దాంతో పనులేవీ సాగవు. ఇక చంద్రబాబు విశాఖ వచ్చిన ప్రతీ సారీ ఆర్టీసీ బస్సులు వందల్లో తరలించేస్తున్నారు. జనాలను సీఎం సభలకు బలవంతంగా తీసుకుపోతున్నారు. అక్కడ వారికి ఆహర పొట్లాలు, నీరు లాంటివన్నీ కలపి బోలెడు ఖర్చు అవుతోంది. ఇదంతా సంబంధిత శాఖ అకౌంట్లో రాసెస్తున్నారు. ఇలా పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి.


అన్ని సీట్లు ఇచ్చేయండి :



వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షానికి ఒక్క ఓటూ వేయకుండా అన్ని సీట్లు నాకే ఇచ్చేయండంటూ బాబు అడుగుతూండడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామిక విధానంలో అన్ని పార్టీలూ ఉంటాయి. జనాలు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటారు. నాకు ఓటు వేయండని అడిగే అధికారం ఉంది కానీ ఎవ్వరికీ వేయవద్దు అలా చేస్తే అభివ్రుధ్ధి సాగదంటూ అదో రకం బ్లాక్ మైల్ రాజకీయం చేయడమేంటని బాబుపై సెటైర్లు  పడుతున్నాయ్.


పనికిమాలిన పార్టీలకు ఓటేయద్దు :



ఫార్టీ  యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు కనీస ప్రజా స్వామిక పద్ధతులను పాటించకపోవడమేంటని నెట్ జన్లు అంటున్నారు. మాది తప్ప అన్ని పార్టీలూ పనికిమాలినవేనంటూ ఓ ముఖ్యమంత్రి చెప్పడం కూడా తగదని అంటున్నాయి. నాకు పోయిన ఎన్నికలలలో మీరు ఓట్లు వేయలేదు, అయిన్నా అభివ్రుధ్ధి చేస్తున్నానంటూ పాడేరులో సీఎం చెప్పడాన్నీ తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి రాజకీయ వివక్ష ఉండకూడదన్న ఆలోచన లేకుండా కేవలం  ఓట్ల వేట కోసమె సీఎం ఈ రకమైన స్పీచులు ఇస్తున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: