ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంచోళ్ళట. వేరే పార్టీలకు ఓట్లేసిన ప్రజలదే తప్పుట. ఇదీ మన చంద్రబాబు గారి ప్రజాస్వామ్య నీతి. పాడేరు సభ సాక్షిగా బాబు మరో మారు ఇలా తనదైన మార్క్ పాలిట్రిక్స్ ని విప్పి చెప్పారు.  డొమోక్రసీకి కొత్త డైమన్షనూ చూపించారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులను చెరో వైపు పెట్టుకుని బాబు ప్రజాస్వామ్యం గురించి ఇలా తనదైన భాష్యం చెప్పారు.


ఎవరిది తప్పంటే :


పనికిమాలిన పార్టీకి పోయిన ఎన్నికలలో మీరు ఓటేసారంటూ డైరెక్ట్ గానే బాబు పాడేరు ప్రజలను  బాబు నిందించారు. నన్ను మీరు ఓడించారంటూ అక్కసు వెళ్ళగక్కారు. అప్పట్లో నా సభలకు కూడా మీరు రాలేందంటూ నిష్టూరాలు వేశారు. మీరు ఎంత చేసినా నేను మంచి వాణ్ణి కాబట్టి మీ కోసం అభివ్రుధ్ధి పనులు చెస్తున్నానంటూ  సానుభూతి చూపించారు. అంతా ఊరకే చేసి పెడుతున్నట్లు గొప్పలు పోయారు.


వాళ్ళే కరెక్ట్ :


ప్రజాస్వామ్యంలో ఓ పార్టీ గుర్తుపై పోటీ చేసి మరో పార్టీలోకి ఫిరాయించడం దారుణమైన నేరం. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి, నమ్మి ఓట్లేసిన జనాన్ని నిలువెల్లా వంచించి  అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నిండు సభలో పొగిడిన సీఎం తప్పంతా మీదేనంటూ ప్రజలనే వేలెత్తి చూపించారు.  ఆనాడే  మీరు టీడీపీకి ఓట్లు వేసుంటే ఎమ్మెల్యేలకు ఫిరాయించే పరిస్థితి వచ్చెది కాదు కదా అన్న ధొరణిలో బాబు మాట్లాడారు.



సో తప్పు మీది అంటూ జనాల వైపే వేళ్ళన్నీ చూపించారు. మీరు ఇలా చేసినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మాత్రం  అభివ్రుధ్ధి కోసం టీడీపీలోకి ఫిరాయించి ఎంతో మేలు చేశారంటూ సీఎం చెప్పుకొచ్చారు. అంటే జనాలకు ఏమీ తెలియక వైసీపీకి ఓట్లేశారు, ఎమ్మెల్యేలు మాత్రం తెలివిగా అధికార పార్టీ వైపు జంప్ అయి గొప్ప పని చేశారు. ఇదీ బాబు గారు సూత్రీకరించిన సరి కొత్త ప్రజాస్వామ్య నీతి. అంటే బాబుకు ఫిరాయింపే ఇంపుగా మారిందని, ప్రజాభిప్రాయమే కంటగింపుగా మారిందని అర్ధమైపోతోంది కదా. ఎనీ డౌట్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: