రాజ‌కీయాల్లో త‌మ అవ‌స‌రం కోసం నాయ‌కులు ఎలా గైనా ప్ర‌వ‌ర్తిస్తారు. ఏ దారిలో అయినా వెళ్తారు. దీనికి వారు వీరు అనే తేడా లేకుండా పోతోంది. ఇప్పుడు అధికార టీడీపీ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించేందుకు రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రి పోరు చేసినా.. అధికార పీఠం ద‌క్కించుకునేందుకు మాత్రం కాంగ్రెస్‌తో దోస్తీ బెట‌ర‌ని లోపాయి కారీ ఒప్పందానికి సిద్ధ‌మైంది. కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై ఏర్ప‌డిన టీడీపీ.. బీజేపీని ఓడిస్తాన‌ని కంక‌ణం క‌ట్టుకుంది. అం టే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌రోక్ష గెలుపును ఆశిస్తున్న‌ట్టే క‌దా? గ‌త కొన్నాళ్లుగా ఈ విష‌యం మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నా.. తాజాగా మంత్రి నారా లోకేష్ నోటి నుంచి వెలువ‌డిన న‌ర్మ గ‌ర్భ వ్యాఖ్య‌లు టీడీపీ-కాంగ్రెస్ మిత్ర‌త్వాన్ని రుజువు చేశాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు రాష్ట్రంలోను అటుకేంద్రంలోనూ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు ఇచ్చేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తేలిపోయింది. 

Image result for రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌

భారతీయ జనతా పార్టీని 2019 ఎన్నికల్లో ఓడించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్ప‌డంతో మ‌ళ్లీ కాంగ్రెస్‌-టీడీపీల మ‌ధ్య ఏదోకుదిరింద‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరింది. బీజేపీతో కలిసి నాలుగేళ్లు ప్రయాణం చేశామని, అప్పుడు ఎక్కడా జీవీఎల్‌ నరసింహారావు కనిపించలేదన్నారు. ఇప్పుడు ఊడిపడి ఏపీపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. అసలు ఆయన తీరు చూస్తుంటే ఆయన ఆంధ్రుడేనా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ వద్ద టీడీపీ ఎంపీలు అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే ఈయన అక్కడికి వచ్చి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వాల్సినదంతా ఇచ్చేశారని ఆయన చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలన్నారు.

Image result for రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌

వాస్త‌వానికి గ‌త కొన్నాళ్ల నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్‌-టీడీపీల మ‌ధ్య బంధం పెరుగుతున్న‌ట్టు వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి కాం గ్రెస్‌పై ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో క‌సి తీరిపోయింద‌ని, ఇప్పుడు అంతా బీజేపీపైనే ఉంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం అంద‌రినీ విస్మ యానికి గురి చేసింది. అదేవిధంగా బీజేపీకి వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేయించారు. ప‌రోక్షంగా అక్క‌డి కాంగ్రెస్‌కు ల‌బ్ధి చేకూరేలా కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇక‌, ఏపీలో కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొందాక‌.. హోదాపైనే తొలి సంత‌కం అని ప్ర‌క‌టించ‌గానే.. చంద్ర‌బాబు అండ్ టీం మొత్తం హోదా ఇచ్చే పార్టీకే మ‌ద్ద‌త‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, కాంగ్రెస్ నుంచి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఇక నుంచి చేర్చుకోకూడ‌ద‌ని తాజాగా టీడీపీలో నిర్ణ‌యించుకోవ‌డం కూడా వీరిద్ద‌రి బంధాన్ని తేట‌తెల్లం చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. సో.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: