గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ ప‌క్కా వ్యూహంతో మందుకు వెళ్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది.  ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థిర‌ప‌డిన ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించ‌డం.. తెలంగాణ వ్యాప్తంగా మ‌హిళ‌ల మ‌ద్ద‌తు సంపాదించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాకు ఇస్తామ‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. అంతేగాకుండా.. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించిన రాహుల్‌గాంధీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భ‌విష్య‌త్‌లో మ‌హిళ‌ల‌కు 50శాతం సీట్లు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు.  ఈనెల 13, 14వ తేదీల్లో పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ప‌ర్య‌టించ‌నున్నారు. 

Image result for RAHUL GANDHI

ఈ సంద‌ర్భంగా రాహుల్‌తో ఈ రెండు విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర నాయ‌క‌త్వం ఏర్పాటు చేస్తోంది. ప్ర‌ధానంగా గ్రేట‌ర్‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న ద్వారా అటు ఆంధ్రుల‌, ఇటు మ‌హిళ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల ప్లాన్‌గా క‌నిపిస్తోంది. శేరిలింగంప‌ల్లిలో కూడా భారీ బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాటు చేస్తోంది. అంతేగాకుండా.. టీఆర్ఎస్‌ను ఇర‌కాటంలోకి నెట్ట‌డం కూడా కాంగ్రెస్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ మోసం చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించి, కాంగ్రెస్ ఇచ్చిన హామీని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్లి ఆంధ్రుల మ‌న‌సుగెలుచుకోవ‌చ్చున‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి. 


ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గంలో ఒక్క మ‌హిళ‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే విష‌యాన్ని ఇక్క‌డ రాహుల్ ప్ర‌స్తావించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు రాష్ట్ర నాయ‌క‌త్వం ప‌క‌డ్బందీగా ప‌నిచేస్తోంది. సీడ‌బ్ల్యూసీలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు తీర్మానం చేయ‌డంతో కాంగ్రెస్ పై ఆంధ్రుల్లో అసంతృప్తి త‌గ్గింద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌తో వారిలో కాంగ్రెస్‌పై మ‌రింత న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని భావిస్తున్నాయి. 


మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న అంశాన్ని కూడా ప్ర‌స్తావించి, ముస్లింల‌ను కూడా ఆక‌ట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మొత్తంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపును అడ్డుకుంటే.. ఇక కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌నే అంచ‌నాల్లో పార్టీ వ‌ర్గాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ క‌ద‌లిక‌ల‌తో అధికార టీఆర్ఎస్ పార్టీలో వ‌ణుకుమొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న రాష్ట్ర కాంగ్రెస్‌కు ఏమేర‌కు బూస్ట్ అందిస్తుందో చూడాలి మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: