జగన్ పాదయాత్ర మరో నాలుగు రోజులలో విశాఖలో అడుగుపెడుతోంది. తూర్పు గోదావరి తరువాత పెద్ద జిల్లాగా ఉన్న విశాఖలో మొత్తం యాభై రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని టాక్. ఏజెన్సీ తప్ప అన్ని అసెంబ్లీ సీట్లూ కవర్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని తెలుస్తోంది. దీంతో భారీ ఏర్పాట్లతో నాయకులు మునిగిపోయారు.


రెండూ ఒకేసారి :


ఇంతకు ముందు అనుకున్న ప్రకారం పూర్తిగా గ్రామీణ ప్రాంతానికే పాదయాత్ర పరిమితం చేశారు. కానీ మారిన షెడ్యూల్ తో విశాఖ సిటీ మొత్తం కవర్ చెయాలని జగన్ భావిస్తున్నారు. ఎంత టైం అయినా పర్వాలేదు అన్ని చోట్లా తిరుగుతానంటూ జగన్ చెప్పడంతో పార్టీ నాయకులు కూడా హ్యాపీగా ఉన్నారు.


ఆ ఇద్దరి ఇలాకాలోనూ :


విశాఖ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల ఇలాకాలోనూ జగన్ పాదం మోపనున్నారు. జిల్లాలో మొదటి అడుగు పెడుతోందే సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం నియోజకవర్గంలో. అక్కడే నాలుగైదు రోజులు జగన్ పాదయాత్ర సాగుతుంది. జిల్లా అంతా అయ్యాక సిటీలోకి ఎంటర్ జగన్ ఎంటర్ అవుతారు. అన్ని అసెంబ్లీ సీట్లూ టచ్ చేస్తూ చివరిగా భీమిలీ మీద నుంచి విజయనగరం వైపుగా జగన్ సాగుతారు. అంటే లాస్ట్ పంచ్ మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఏరియాలో అన్న మాట.


అక్కడే గురి :


పోయిన చోటనే వెతకాలని నీతి. ఓఅడిన చోటనే గెలవాలన్నది రాజకీయ రీతి. జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. విశాఖలో పోయిన ఎన్నికలలో తల్లి విజయమ్మ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే ఆయన సిటీలో పాదయాత్రకు రెడీ అయిపోయారు. అన్ని వర్గాలను కలిసేందుకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాదయాత్ర జిల్లా మొత్తం చుట్టేస్తుందని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: