ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ నీ మానసికంగా దెబ్బ కొట్టాలని టిడిపి మరియు దాని అనుబంధ ఛానల్స్ ఎల్లో మీడియా తాజాగా ఆయన సతీమణి వైయస్ భారతీ పై నీచాతినీచమైన రాతలు రాస్తూ...కథనాలు ప్రసారం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగట్టారు. దీంతో ఎంతో మనస్తాపానికి గురయ్యారు రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎల్లో మీడియా అల్లిన కథనాలపై మండిపడ్డారు.

Image may contain: text

ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారిపోయాయో అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు జగన్ బహిరంగ లేఖ రాశారు. జడ్జీగారు పరిగణనలోకి తీసుకున్న తరవాతే చార్జిషీట్ లో ఏముంంది అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జీగారు పరిగణనలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా,

Image may contain: text

ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? .. కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను’ అని జగన్ తన లేఖను కొనసాగించారు. లేఖలో తెలుగుదేశం పార్టీని అలాగే..ఆ పార్టీకి అనుబంధ సంస్థలుగా పనిచేసే ఎల్లో మీడియా చానల్స్ ని ఏకిపారేశారు.

Image may contain: text

అయితే మరోపక్క తమ నాయకుడిపై ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నా పత్రికలపై అడ్డదిడ్డమైన కథనాలు ప్రసారం చేస్తున్న ఛానల్స్ పై కూడా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు జగన్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు అండ చూసుకునే రెచ్చిపోయే మీడియా చానల్స్ అదినేతలు త్వరలో పశ్చాత్తాపపడే రోజులు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు కొంతమంది కార్యకర్తలు. ఎన్ని అడ్డదిడ్డమైన పన్నాగాలు పన్నిన వచ్చే ఎన్నికలలో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని వైసిపి పార్టీకి చెందిన నాయకులు తెలియజేశారు. ప్రస్తుతం జగన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: