లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఇతను ఎక్కడ మైకు తీసుకంటే పార్టీ పరువు ఎక్కడ పోతుందని టీడిపి శ్రేణులే మధన పడి పోతుంటారు. ఎందుకంటే చిన్న బాబు వాక్చాతుర్యం మరీ అలా ఉంటుంది. సభలో ఒక్క సారిగా కామెడీ మొదలు పెడతాడు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని లోకేష్ బాబు ప్రకటించేశాడు. చాలా గొప్ప లక్ష్యమే కదా. అయితే బీజేపీ ఎక్కడ ఓడించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడో లోకేష్ బాబు. ఆ విషయాన్ని ఆయన చెప్పలేదు.

Image result for lokesh

ఒకవేళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యం అనుకుంటే.. దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పోటీచేసి బీజేపీని ఓడిస్తుందని లోకేష్ చెప్పాల్సింది. అయితే చినబాబు అలా చెప్పలేదు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని మాత్రం ఘనంగా ప్రకటించుకున్నాడు. అంటే.. ఏపీలో బీజేపీని ఓడించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నమాట. గత ఎన్నికల్లో రెండు ఎంపీ సీట్లలో, నాలుగు ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన బీజేపీని వచ్చేసారి టీడీపీ తుక్కుతుక్కుగా ఓడిస్తుందనమాట. చాలా చాలా పెద్ద లక్ష్యమే.

Image result for lokesh

ఈ మధ్యకాలంలో తెలుగుదేశంపార్టీ బీజేపీ మీద మాట్లాడుతున్న మాటలు ప్రహసనంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కు పట్టిన గతే వచ్చేసారి బీజేపీకి అని ఒకటికి వెయ్యిసార్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజం అనుకున్నా.. బీజేపీకి పోయేది ఏముంది? కాంగ్రెస్ అంటే.. అప్పటికి ఏపీలో అధికారంలో ఉండింది, బోలెడన్ని ఎంపీ సీట్లు ఏపీలో ఉండేవి. ఏపీలో బీజేపీ ఇప్పుడున్నదే ఏమీలేదు. రేపేదో పోతుంది.. అని తెలుగుదేశం అనడమే కామెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: