జగన్ ముక్కుసూటిగా రాజకీయాలు చేస్తానంటే కుదిరే రోజులు కావివి. ఆయన నాయన వైఎస్ కాలంలోనే అది వీలు పడలేదు. జగన్ మాత్రం ఎందుచేత ఇలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడంలేదు. పాతకాలం రోజులు ఎపుడో పోయాయి. ఇపుడు అంతా ఊసరవెల్లి పాలిట్రిక్స్ కే విజయాలు. జగన్ కు దైవభక్తి, జనం మీద ఉన్న నమ్మకం మంచివే కానీ, ఎన్నికలల సంగ్రామంలో వాటికంటే ఎత్తుగడలు అతి ముఖ్యం. అవి లేకనే 2014 ఎన్నికలలో వైసీపీ ప్రజాభిమానం ఉండి కూడా చతికిలపడిపోయింది.


మళ్ళీ అవే సీన్లు :


వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జగన్ ఆలోచనా విధానంలో ఏ మాత్రం మార్పు లేదు. అప్పటికీ, ఇప్పటికీ ఆయన జనాన్నే నమ్ముకుంటున్నాడు. మంచిదే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు జనమే. కానీ ఈ జనంలో కూడా ఒకప్పటి నిబద్ధత  ఉందా అన్నది చూడాలి. ఓటుకు నోటు ఇస్తే అమ్ముడుపోయే  బాపతు ఎంతో మంది, అలాగే ఇప్పటికీ కులం పేరు చెబితే పిచ్చెత్తిపోయే వారూ ఉన్నారు. ప్రాంతాలూ, వ్యాపారాలు, స్నెహాలూ ఇలా జనం అన్న వారు ఎంతగానో విడిపొయారు. వారి నుండి ఓట్లు రాబట్టాలంటే ఎక్కడికక్కడ రాజకీయం చేయాలి. అప్పటికపుడు ఎత్తులూ జిత్తులూ వేయాలి.


ఆ విషయంలో ఆయనే  :


ఎన్నికల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు బాగా ఆరితేరిపోయారు. అందులో ఆయనది  సుదీర్ఘమైన అనుభవం. జనాల నుంచి ఓట్లు ఎలా తెచ్చుకోవాలో, వాటిని అంతే భద్రంగా బ్యాలెట్  బాక్సులలో ఎలా వేయించుకోవాలో ఆయను తెలిసినంతంగా ఎవరికీ తెలియదు ఇప్పటికే బూత్ ల వారీగా కార్యకర్తలను పెట్టి ప్రతి వంద మందికీ ఒకరు వంతున కరడు కట్టిన టీడీపీ కార్యకర్తను నియమించే పని బాబు పూర్తి చేసేశారు. వారిని ఆ దిశగా ట్రైనింగ్ కూడా ఈ మధ్యనే ఇచ్చారు. రేపటి రోజున వీరంతా ఆ వందమందినే టార్గెట్ గా చేసుకుని పోలింగ్ అయ్యేంత వరకూ నీడలా ఉంటారు. ఎన్నికల తాయిలాలు. ఇతరత్రా హామీలు అన్నింటికీ వీర డైరెక్ట్ గా బాధ్యత వహిస్తారు. ఇంతటి నెట్ వర్క్ టీడీపీ చేసుకుని పోతోంది ఓ వైపు. '


అది సరిపోతుందా :


జగన్ కష్టపడతారు, , రెయింబవళ్ళు జనాలలో ఉంటారు. సుదీర్ఘమైన పాదయాత్ర కూడా చేస్తూ వస్తున్నారు. అంతా బాగుంది కానీ జగన్ మాత్రమే తిరిగితే వైసీపీ గెలిచేస్తుందా. పార్టీని కదిలించి జనంలోకి పంపించవద్దా. నిజం చెప్పాలంటే ఏపీలో ఇపుడు జగన్ తప్ప మొత్తం  పార్టీ ఏడాదిగా నిద్రావస్థలోనే ఉంది. నాయకుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడన్న ధీమా  పెరిగింది. దాంతో జనంలోకి వెళ్ళడం మానేశారు వైసీపీ నేతలు. 


సీనియర్లు ఉన్నా :


ఇక వైసీపీలో ఎంతో మంది సీనియర్లు అనుభవం ఉన్న వారు ఉన్నారు. మాజీ మంత్రులు నాలుగైదు సార్లు గెలిచిన వారూ ఉన్నారు. వారంతా ఇపుడు ఖాళీగా కనిపిస్తున్నారు. వీలుంటే ప్రెస్ మీట్ పెట్టడం, లేకపోతే తెర వనక్కు పోవడం, ఇదే వైసీపీలో కనిపిస్తున్న సీన్. మాజీ ఎంపీల రాజీనామాల త్యాగాలను సైతం పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. మరో వైపు టీడీపీ, జనసేన నిత్యం జగన్, వైసీపీ టార్గెట్ గా చేస్తున్న ఆరోపణలు సైతం తిప్పికొట్టలేని నిస్సహాయ వాతావరణం ఆ పార్టీలో ఉంది. దీన్ని మొత్తం సరిద్దకుండా, తన లోపాలను సరిచెసుకోకుండా జగన్ జనాన్నే నమ్ముకుంటే మరో మారు చేదు ఫలితాలు వస్తాయన్నది నిజం. ఇప్పటికైన మించిపోయింది లేదు అందరినీ కలుపుకుని రాజకీయం చేయాలి. పార్టీని జనంలోకి పరుగులు పెట్టించాలి. ఆ దిశగా అడుగులు పడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: