డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలలో మహిళలపై జరిగే లైంగిక విధ్వంసానికి అంతే లేకుండా పోతుంది. దీనిపై ఉభయరాష్ట్రాల వ్యాప్తంగా ప్రజల్లో నిరసన పెల్లుభుకుతుంది. ముఖ్యంగా మహిళల్లో అగ్నికీలలు రగుల్కుంటున్నాయి. అమరావతి విశ్వనగర నిర్మాతల మౌనం తెలుగు జాతికి క్షేమంకాదు. ప్రభుత్వ ఉనికే ప్రశ్నార్ధకమౌతుంది.
Dr silpa sucide Dr ravikumar principal ramanaiah కోసం చిత్ర ఫలితం
ఈ సంఘటనపై వైసిపి శాసనసభ్యులు రోజా స్పందిస్తూ శిల్పను సైకో అంటూ ఒక వర్గం చేసే ప్రచారం అత్యంత దారుణమని, ఆమెది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యే నని విమర్శించారు . శిల్ప కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరపున కనీసం యువమంత్రి నారా లోకేశ్ సహా ఎవరూ పరామర్శించలేదని, విద్యావంతులై ఇంకా ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్న మహిళలకు కూడా ప్రస్తుత ప్రభుత్వపాలనలో కనీస రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
roja mla photos కోసం చిత్ర ఫలితం
శిల్ప కుటుంబసభ్యులను తాను పరామర్శించానని, అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదికాదని అన్నారు. గవర్నర్‌  కు లేఖ రాసిందన్న కోపంతోనే ప్రొఫెసర్లు  శిల్పపై శత్రుత్వం పెంచుకోని కక్షతో సాగించిన వికృత చర్యలకు ఆమె బలైందని - ఆత్మహత్యను ప్రేరేపించింది ప్రభుత్వ ప్రొఫెసర్లు మాత్రమేనని ఆమె నిర్ద్వంధంగా ఆరోపించారు. ఇంత జరిగినా ప్రభుత్వం ప్రొఫెసర్లను కాపాడే ప్రయత్నం చేస్తోందని శ్రీమతి రోజా విమర్శించారు. శిల్ప ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినం గా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 



రిషితేశ్వరి కేసులా ఈ కేసును నీరు గార్చితే ప్రభుత్వానికి పుట్టగతులుండవని ఉభయ తెలుగురాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారు. అయితే డాక్టర్  శిల్ప ఆత్మహత్య కేసు విషయమై సీఎం చంద్రబాబునాయుడుకు  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం నాడు నివేదికను అందించారు.
doctor shilpa parents కోసం చిత్ర ఫలితం
ఈ నెల 3వ తేదీన డాక్టర్ శిల్ప  తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పై విచారణ కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం “హైలెవల్ కమిటీ” ఏర్పాటు చేసి సీఐడీ విచారణ కు ఆదేశించింది.



డాక్టర్  శిల్ప వ్యవహరంపై ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటు చేసుకొంటున్న పరి ణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ శుక్ర వారం నాడు ఏపీ సీఎం చంద్ర బాబుకు ఈ ఘటనకు సంబంధించిన నివేదికను అందించారు. అయితే ఈ ఘటనపై సీఐడీ విచారణను పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 
Dr silpa sucide Dr ravikumar principal ramanaiah కోసం చిత్ర ఫలితం
అంతిమంగా జూనియర్ డాక్టర్ల ఉద్యమం ప్రారంభమౌతున్న దరిమిలా డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు డాక్టర్లను బదిలీ చేశారు. ఎస్వీ మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ రమణయ్యను తొలగించారు. ఈ విషయమై  ముందుగానే చర్యలు తీసుకొంటే డాక్టర్ శిల్ప బతికి ఉండేదని ఆమె కుటుంబ సభ్యులు ఆభిప్రాయపడుతున్నారు.
Dr silpa sucide Dr ravikumar principal ramanaiah కోసం చిత్ర ఫలితం
డాక్టర్ శిల్ప ఆత్మహత్య  చేసుకోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శిల్ప ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లపై చర్యలు తీసుకొంటే ఇంతకాలం శిల్ప చేసిన పోరాటానికి న్యాయం జరుగుతోందని  కుటుంబసభ్యులు  భావిస్తున్నారు.  లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాటం చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొంటుందని భావించలేదని  కుటుంబసభ్యులు తమ అభిప్రాయాలను మీడియాకు షేర్ చేశారు. 
doctor shilpa కోసం చిత్ర ఫలితం
ఆ సందర్భంగా డాక్టర్ శిల్ప కాలేజీలో పడిన ఇబ్బందులను తమ తో షేర్ చేసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. శిల్ప ఆత్మ హత్య చేసుకొంటుందనే విషయం తమకు తెలియదన్నారు. ఏనాడూ కూడ తమకు ఈ విషయమై అనుమానం రాలేదని శిల్ప కుటుంబసభ్యులు చెప్పారు.  



చనిపోవడానికి నాలుగుగంటల ముందు తాను శిల్పతో మాట్లాడినట్టు ఆమెతండ్రి  చెప్పారు. పీజీ పరీక్షల ఫలితాలు వచ్చి నట్టు ఆ సమయంలో శిల్ప తనకు చెప్పలేదని అన్నారు. తన కూతురుకోసం తాను బ్యాంకు ఉద్యోగం ఈ ఏడాది జనవరిలోనే మానేయాలని భావించానని,  అయితే ఇప్పుడే ఉద్యోగం మానేయవద్దని తన కూతురు చెప్పిందన్నారు. అందుకే మానేసిన కొన్నిరోజుల తర్వాతే ఆ విషయమై శిల్పకు  సమాచారం  ఇవ్వాలని  అనుకున్నానన్నారు. ఇదిలా ఉంటే  తన కూతురిని  పీడియాట్రిక్ విభాగం హెచ్‌ఓడీ  చాలా ఇబ్బందులకు గురిచేశారని డాక్టర్ శిల్పతల్లి చెప్పారు. 

doctor shilpa కోసం చిత్ర ఫలితం


*టీ కప్పు విసిరేయడం,

*బుక్స్ విసిరేయడం,

*సభ్యత తప్పి తప్పుడుగా అంపార్లమెంటరీ గా మాట్లాడడం, 

*సహ విద్యార్థులను తనతో మాట్లాడకూదని వేధించేవారని చెప్పారు.



అయితే ఆరు మాసాల పాటు ఓపిక పట్టాలని తాను సూచించినట్టు ఆమె తెలిపారు.  మైగ్రేయిన్‌ కోసం డాక్టర్ శిల్ప ట్రీట్మెంట్ తీసుకొందని తల్లి చెప్పారు. డాక్టర్ రవికుమార్ బెదిరింపులవల్లే కొందరు విద్యార్థులు  డాక్టర్ శిల్ప ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే తమతో ఫోన్ చేసి మాట్లాడేవారని ఆమె తల్లి గుర్తు చేసుకొన్నారు.



మరో వైపు తన సోదరి ఇలా చేస్తోందని భావించలేదని, ఆమె ధైర్యవంతురాలని ఆమె సోదరి అన్నారు.  శిల్ప దేని  కోసమైతే పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితం తెలియ కుండానే  కనుమూసిందన్నారు. లైంగిక వేధింపులపై ఎంతో ధైర్యంగా పోరాటం చేసిన తన సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో ఇంతకాలం చేసిన పోరాటం వృధాగా మారిందన్నారు.



ఇప్పటివరకు  తమకు న్యాయం జరుగుతోందని భావిస్తున్నట్టు చెప్పారు. కాలేజీ లో కళాశాలలో జరుగుతున్న వివిధవర్గ  రాజ కీయాల వల్లే తమ సోదరికి న్యాయం జరగలేదని భావిస్తున్నట్టు సోదరి చెప్పారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా స్పందించకపోతే పరిణామాలు ధారుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

doctor shilpa కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: