తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి మరణించిన తర్వాత తమిళప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.    ప్రస్తుతం ఆయన మరణం తర్వాత  డీఎంకే అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది. దీంతో, ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను నియమించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.  ఇందుకు ఈనెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.   డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాదురై మరణించడంతో పార్టీలో ఆయన తర్వాత స్థానలంలో ఉన్న కరుణానిధి  సులువుగా అధ్యక్షులయ్యారు.
Stalin Will DMK Chief?
అంతేగాక ముఖ్యమంత్రి బాధ్యతలు సైతం చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ సైతం 96 ఏళ్ల వృద్ధుడు కావడంతో పార్టీ పగ్గాలను తప్పనిసరిగా కరుణ సంతానానికే అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది.  మరోవైపు, తన రాజకీయవారసుడు స్టాలినే అంటూ గతంలోనే కరుణ పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల సమయంలో స్టాలిన్ రాష్ట్రమంతా తిరిగి... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలను సాధించిపెట్టారు.
Image result for karunanidhi dead
అన్నా అరివాలయంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా  హాజరు కావాలని పార్టీ ఆదేశించింది. సమావేశం ప్రారంభమైన వెంటనే కరుణానిధి మృతికి సంతాపం తెలిపే కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ ఫౌండర్ అన్నాదొరై  1969లో మరణించిన సమయంలో కూడా ఆయన మృతికి సంతాపం తెలిపే తీర్మానాన్ని పార్టీ ప్రవేశ పెట్టింది.   స్టాలిన్ పార్టీ ప‌గ్గాలు చేప‌డితే వ్య‌తిరేక వ‌ర్గం ఎలా స్పందిస్తుంది అనే దాని పై ఆస‌క్తి నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: