మన తన అవసరాలకు అనుకూలంగా సమయాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా దూర ప్రయాణాలు సులభతరం చేసుకోవడానికి వాహనాలు వాడుతున్న విషయం తెలిసిందే.  సామాన్యులు సైతం ఖచ్చితంగా తన స్థాయికి తగ్గట్టు వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వాహనాలు కొనగానే సరిపోదు..దానికి అన్ని రకాల కాగితాలు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ,ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ లాంటివి ఖచ్చితంగా ఉండాలి..వీటిలో ఏవి లేకపోయినా ఫైన్ పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.  అయితే ప్రతిసారీ వాహనాలకు సంభందించిన పత్రాలు మనతో పాటు తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిపడుతుంటాం. 

ఇక టూవీలర్లు వినియోగించే వారు అయితే ఎన్నో సార్లు తమ పత్రాలను తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చినపుడు, సర్వీసింగ్ చేయించినపుడు వాహనాలకు సంభందించిన పత్రాలు తడిచిపోతుంటాయి. ఇలాంటి కారణాల వలన ఎన్నో సార్లు జిరాక్సులు చేయించుకుంటుంటారు. ఇక మీదట బయటకు వెళ్లినప్పుడు మీవెంట తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇన్యూరెన్స్‌ కాగితాలు తీసుకెళ్లకపోయినా ఫర్వాలేదు.   తాజాగా ప్రభుత్వం వాహన చోదకులకు శుభవార్త తెలిపింది. ఇక మీదట బయటకు వెళ్లినప్పుడు మీ వెంట తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ - వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు - ఇన్స్యూరెన్స్ కాగితాలు తీసుకెళ్లకపోయినా ఫర్వాలేదు. ``అదెలా? ప్రతిచోటా పోలీసులు తనిఖీలు మామూలు అయిపోయిన సందర్భంలో లైసెన్స్ లేకపోతే ఇంకేమైనా ఉందా?`` అని ఆశ్చర్యపోకండి. ఇక నుంచి మనకు సంబంధించిన పత్రాలు అన్నీ డిజిలాకర్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
driving 10082018 2
డిజిలాకర్‌లో వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించినా పోలీసులు వాటిని పరిగణించలేదు. కానీ ఇప్పటి నుంచి డిజిలాకర్‌లో చూపించే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపించింది. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఏ పత్రాలనైనా డిజిలాకర్‌ యాప్‌ లేదా ఎంపరివాహన్‌ మొబైల్‌ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్‌ ధ్రువపత్రాల స్థానంలో డిజిలాకర్‌లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది.
driving 10082018 3
బిహార్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో తొలిసారిగా డిజిలాకర్‌లో ఉన్న పత్రాలను లీగల్‌ డాక్యుమెంట్స్‌గా పరిగణించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా డిజిలాకర్‌ లేదా ఎంపరివాహన్‌ యాప్‌లో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్యూరెన్స్‌ కాగితాలు, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను అధికారికంగా ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది.  ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్ పత్రాలకు బదులు డిజిలాకర్ లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. కేంద్ర రవాణా శాఖ ఆదేశాల ప్రకారం ఈ నిబంధన శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: