పవన్ కళ్యాణ్ విమర్శలు కు టీడీపీ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. పవన్ కళ్యాణ్ మాటల తూటాలు బాబు కు మరియు అతని కొడుకు అయినా లోకేష్ కు సూటిగా దిగుతున్నాయి. అయితే మొన్నటివరకు జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతుంటే ఇప్పడూ పవన్ కళ్యాణ్ దాడి ఎక్కువైందని టీడీపీ లో చర్చలు మొదలయినాయి. అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద చేసిన విమర్శలు కు టీడీపీ దగ్గర సమాధానమే లేదు.

Image result for pavan janasena

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ఇలా నిప్పులు కురిపించారు పవన్. ఈ జిల్లా నుంచి 15కు 15 సీట్లు ఇస్తే లోకేష్ ను మంత్రిని చేసుకున్నారు తప్ప, జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 15కు 15 సీట్లు రాకపోతే మీరు ప్రభుత్వం ఏర్పాటుచేసే వాళ్లా? అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? మీ అబ్బాయి ఐటీమంత్రి అయి అందరి తలల మీదకి ఎక్కి తొక్కేయగలిగేవాడా..!

Image result for pavan janasena sabha

ప్రస్తుతం బీజేపీని తిడుతున్న చంద్రబాబును అస్సలు నమ్మడానికి వీల్లేదంటున్నారు పవన్. భవిష్యత్తులో మోడీతో మళ్లీ కలిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని, ఇలా ఎప్పటికప్పుడు మారిపోయే ముఖ్యమంత్రిని తను ఎక్కడా చూడలేదంటున్నారు.  కాంగ్రెస్ ను మొన్నటివరకు తిట్టి ఇప్పుడేమో కాంగ్రెస్ అభ్యర్థికి పార్లమెంట్ లో ఓటేశారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు మారిపోతాడో తెలీదు. రేపు ఉదయం చంద్రబాబు, నరేంద్రమోడీ పరస్పరం గట్టిగా కౌగిలించుకొని మేమిద్దరం ఒకటే, మళ్లీ మాకే ఓటేయండని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని బాబు దుమ్ము దులిపాడు.!


మరింత సమాచారం తెలుసుకోండి: