ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న వేళా కుల మత ప్రాతి పదికిన పదవులు ఇవ్వలేని బాబు ప్లాన్ చేస్తున్నాడు. అయితే కాబినెట్ లోకి కొంత మందికి ఎంట్రీ మరి కొంత మందికి ఎగ్జిట్ ఉంటుందని తెలుస్తుంది.  ఈ పునర్వ్యస్థీకరణలో కొన్ని వికెట్లు పడబోతున్నాయని కూడా అంటున్నారు. ఇలా పదవులను కోల్పోయే వారిలో మంత్రి భూమా అఖిలప్రియ ఉండబోతోందని సమాచారం.

Image result for bhuma akhila priya

అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవిని ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు పెట్టిన ఒత్తిడికి తాళలేక భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలయితే.. ఎలాగూ నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయనే లెక్కలతో, సానుభూతిని వాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చాడు.

Related image

తన తండ్రి మరణిస్తే అందుకు కారణం చంద్రబాబే అవుతాడని హెచ్చరించిన భూమా అఖిలప్రియ ఎంచక్కా బాబు కేబినెట్లో మంత్రి అయ్యింది. అది కూడా తండ్రి చనిపోయాకా. ఇప్పుడైతే అఖిలప్రియతో బాబుకు దాదాపుగా అవసరం తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగే వారు ఉండరనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకు ఎలాగూ ఉండనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: