ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.  తేడా వస్తే సొంత పార్టీ నేతలనుకు కూడ ఉతికి ఆరేసే జేసీ ఆ మద్య సీఎం పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని అయిపై ఎన్నో సార్లు నోరు పారేసుకున్నారు.  తాజాగా ఇప్పుడు ప్రధాని మోదీని టార్గెట్ చేసుకొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.  ప్రధాని నరేంద్రమోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Image result for ap special status
 మన కర్మకొద్ది మోదీ వద్ద ఉన్న మంత్రులు కూడా ఆయనలాంటి వారే అని అన్నారు.   అంతే కాదు ఏపికి ఎప్పుడూ అన్యాయం చేస్తూ..చిన్న చూపు చూస్తున్న రైల్వే, ఆర్థిక మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. వారు కూడా మోదీలానే నిరంకుశుల్లా తయారయ్యారన్నారు.   విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపికి ఇప్పటి వరకు ఏదీ సాధించుకొని తెచ్చుకోలేదని..తెచ్చుకోనూ లేమని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గుతుందేమో కానీ, అదే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
Image result for modi
ఏపీలో టీడీపీకి 25 లోక్‌సభ స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.   ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏపి అభివృద్ది కోసం పాటుపడాలని చూసినప్పటికీ..ఇప్పటి వరకు ఏదీ సాధించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా తానైతే సంతృప్తిగా లేనని జేసీ పేర్కొన్నారు. ఓ ఎంపీగా తాను నిర్వర్తించాల్సిన విధుల పట్ల తనకు ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. ఎంతసేపటికీ నిరసనలతో సరిపెడుతున్నామని, ప్రతి పార్టీ నిరసనలకే పరిమితమవుతోందని జేసీ పేర్కొన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: