వైఎస్ జగన్ ని రాజకీయంగా ఎదుర్కొనడానికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి దొంగ కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కేసులను టేకప్ చేశారు సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. ఇదిలావుండగా తాజాగా జగన్ సతీమణి వైయస్ భారతి గురించి జగన్ కేసులలో ఈడి విచారిస్తున్నట్లు వస్తున్న వార్తలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు జేడీ లక్ష్మీనారాయణ.

Related image

గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఆయన వైజాగ్ లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ” జగన్ సతీమణి భారతి పేరును ఈడీలో చేర్చారని వార్తలు విన్నాను కానీ అందులో ఎంతవరకు నిజముందో తెలియదు.. అయితే గతంలో దాఖలు చేసిన చార్జ్ షీట్లో తన పేరు లేదని ఆయన అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Image result for jd lakshmi narayana

అయితే ఇదంతా 2019 ఎన్నికలలో జగన్ ను నిలువరించడానికి వైసీపీ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికి చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా చానల్స్ అధినేతలు ఆడుతున్న డ్రామాలు అని అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు.

Image result for ys bharathi ys jagan

ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర తో ప్రజలలోకి దూసుకు వెళ్లిపోవడంతో జగన్ను ఎలాగైనా నిలువరించాలని చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించారని అంటున్నారు మరికొంతమంది రాజకీయ నాయకులు. ఏదిఏమైనా వచ్చేఎన్నికలలో కచ్చితంగా జగన్ చంద్రబాబుకి తగిన రీతిలో బుద్ధి చెబుతారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: