సరిగ్గా ఏడేళ్ళ  క్రిత్రం చూసుకుంటే దాదాపు ఇవే నెలలలో ఏపీలో  ఓ రాజకీయ సంచలనం చోటుచెసుకుంది.  నాడు కాంగ్రెస్ ని ధిక్కరించి బయటకు వచ్చిన కొద్ది రోజుల  తేడాలోనే జగన్ అరెస్ట్ అయ్యారు.  సీబీఐ ఆయనను అరెస్ట్ చేసి పెను సంచలనం స్రుష్టించింది. అప్పట్లో జగన్ తో పాటు తెల్లారి లేస్తే న్యూస్ పేపర్ లో కనిపించే మరో పేరు సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ. ఆ ఇద్దరూ లేని ఫొటోలు ఆ రోజులలో పత్రికలలో లేవంటే చిత్రమే.


సీన్ కట్ చేస్తే :



పదహారు నెలల జైలు జీవితం, ఆ తరువాత ఏపీ విభజన ఎన్నికలు, జగన్ పార్టీకి త్రుటిలో అధికారం తప్పిపోవడం, నాలుగున్నరేళ్ళుగా ప్రతిపక్ష  నాయకుడుగా ఏపీలో జగన్ కదం తొక్కుతున్న నేపధ్యం. ఇలా ఉంటే జేడీ లక్ష్మీనారాయణ ఆ తరువాత మహారాష్ట్ర వెళ్ళిపోవడం అక్కడ రాష్ట్ర స్థాయి పోస్టింగ్  చేపట్టడం, కొద్ది నెలల ముందు ఆ పోస్ట్ కు వాలంటరీ గా రాజీనామా చేసి జనాలలోకి రావడం లేటేస్ట్ న్యూస్.


ఆ ఇద్దరూ అలా :



ఇదంతా ఎందుకంటే ఇపుడు ఈ ఇద్దరూ ఒకే జిల్లాలో ఒకే  టైంలో టూర్లు వేసుకున్నారు. జగన్ పాదయాత్ర ఈ నెల 14న విశాఖ జిల్లాలో ఎంటర్ అవుతోంది. మరో వైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ  విశాఖ జిల్లాలో వారం రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ జిల్లాలో రెండు రోజుల పాటు ఒకే సారి టూర్లు చేసే రేర్ సీన్ ఇపుడు విశాఖ వాసులకు కనిపించబోతోంది. పొలిటికల్ గా  యాక్టివ్ అవుదామనుకుంటున్న లక్ష్మీ నారాయణ ఒక వైపు, సీఎం సీటుకు కడు చేరువకు వస్తున్న ఏపీ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ జగన్ మరో వైపు... క్యా సీన్ హై.


వారికి నిరాశ :



ఇదిలా ఉండగా చోడవరంలో పర్యటిస్తున్న మాజీ జేడీని పచ్చ మీడియా  కలసి జగన్ కేసులు గురించి కొత్త విషయాలను చెప్పనని కోరింది. లేటెస్ట్ గా జగన్ భార్య భారతిపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపధ్యంలో మాజీ జేడీ ఏమైనా చెబితే హాట్ న్యూస్ అవుతుందని సదరు మీడియా ముచ్చటపడింది. అయితే చిత్రంగా లక్ష్మీనారాయణ ఆ కేసు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవీ  తనకు తెలియవని చెప్పడంతో ఖంగు తినడం పచ్చ మీడియా వంతు అయింది. పైగా తాను 2013లోనే ఆ కేసు వదిలేసానంటూ  మాజీ జేడీ చెప్పడంతో నిండా నిరాశతో సదరు చానల్ వెనుతిరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: