రాజకీయాలను మారుస్తానంటూ  ఆ  మధ్య భారీ స్టేట్మెంట్స్ ఇచ్చిన పవన్ ఇపుడు తానే మారిపోయారు. ఫక్త్ పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు. కులాలు లేవంటూ కులల గురించి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు వద్దంటూ తానూ ఇస్తానంటున్నారు. అధికారంపై మోజు లేదంటూనే సీఎం అవుతానంటున్నారు. కేవలం నాలుగు నెలలు, ఇంతలో ఎంత మార్పు. వాటే చేంజ్ పవన్...


ఓట్ల వేటేనా :


జనసేనాని పవన్ కళ్యాణ్ ఓట్ల వేట మొదలెట్టేశారు. సొంత సామాజిక వర్గం దండిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో  పర్యటిస్తున్న పవన్ అక్కడ జనాలపై వరాల  వానే కురిపించారు. సగటు రాజకీయ నాయకుడిలా అందరినీ ఆకట్టుకునేందుకు ట్రై చేశారు. ఏదీ కాదన్నారో అదే ఔనంటూ ముందుకెళ్తున్నారు.


అందరికీ అన్నీ :


రిజర్వేషన్ల అంశం బలమైనదని పవన్ అంగీకరించారు. అందుకే తానూ ఇస్తున్నానంటున్నారు. మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన పవన్, కాపుల ఓట్లకూ గేలం వేశారు. తాను కులాలకు అతీతం అంటూనే కాపులు కోరుకున్న 5 శాతం రిజర్వేషన్ల కోసం 9వ షెడ్యూలో ఆ అంశాన్ని  చేర్చేందుకు క్రుషి చేస్తానని అన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల  మాదిరిగానే బీసీలకు ఇబ్బంది లేకుండా అన్న పదం వాడారు. ఇక జనాభా లెక్కన దామాషా పధ్ధతిలో రిజర్వేషన్ ఇస్తానటున్నారు. 


సామాన్యుడు నెగ్గినట్లు :



చంద్రబాబు, జగన్ సీఎం అయితే పెద్ద వాళ్ళు పీఠమెక్కినట్లంట. పవన్ సీఎం అయితే మాత్రం సామాన్యుడే ముఖ్యమంత్రి అయినట్లుట. జనసేనాని  భాష్యం అదిరింది కదూ. పవర్ వద్దంటూనే మరో వైపు సీఎం చేయండని చెబుతున్న పవన్ రాజకీయాలను బాగానే వంట బట్టించుకున్నాడు.  మొత్తానికి జనసేనాని అందరిలాగానే రొటీన్ పాలిట్రిక్స్ తెర తీశారు. చూద్దాం ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: