Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 2:40 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ శాంపుల్ మ్యానిఫెస్టో చూశారా ? ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా ?

ఎడిటోరియ‌ల్ :  ప‌వ‌న్ శాంపుల్  మ్యానిఫెస్టో చూశారా ?  ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా ?
ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ శాంపుల్ మ్యానిఫెస్టో చూశారా ? ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంత కాలం ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌పై చంద్ర‌బాబునాయుడు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని  విమ‌ర్శించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అదే బాటప‌ట్టారు. జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు, ఉచితాలపై  హామీలు ఇవ్వ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు రాల‌వ‌న్న వాస్త‌వాన్ని ప‌వ‌న్ గ్ర‌హించిన‌ట్లున్నారు. అందుక‌నే త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోయే మ్యానిఫెస్టోకు శాంపుల్ గా  కొన్ని హ‌మీల‌ను ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు బ‌హిరంగ‌స‌భ‌లో  ప్ర‌క‌టించారు.  శాంపుల్ ప్ర‌క‌ట‌న‌లో అన్నీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌టానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న  విష‌యం అర్ధ‌మ‌వుతోంది. 


శాంపుల్ హామీలు ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా ?


శాంపుల్  ప్ర‌క‌ట‌న పై ప‌వ‌న్ మాట్లాడుతూ,   అన్నీ వ‌ర్గాల‌కూ హ‌మీలిచ్చారు.  ఇపుడు వ‌దిలిన శాంపుల్ తో త్వ‌ర‌లో  విడుద‌ల  చేయ‌బోతున్న మ్యానిఫెస్లో ఎలా ఉండ‌బోతోందన్న విష‌యంలో ఒక అంచనాకు రావ‌చ్చు. ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీల‌ను ఇవ్వ‌టమంటే జనాల‌ను మోసం చేయ‌ట‌మే అంటూ ఇంత కాలం చంద్ర‌బాబు, జ‌గ‌న్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు, ఆ ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యాన్ని అంద‌రూ చూస్తున్న‌దే. మ‌రి ఇపుడు తాను ఇవ్వ‌బోయే హామీల‌ను ఏ విధంగా అమ‌లు చేయ‌బోతున్నారో ప‌వ‌న్ జ‌నాల‌కు స‌మాధానాలు ఇవ్వాల్సుంటుంది. 


తేనె తుట్టెను క‌దుపుతున్న ప‌వ‌న్

janasena-pawan-kalyan-sample-manifesto-2019-electi

ఇక‌, శాంపుల్లో ఇచ్చిన హామీల విష‌యాన్ని గ‌మ‌నిస్తే, రేష‌న్ షాపుల్లో ఇచ్చే బియ్యం, ఇత‌ర స‌రుకులు  స‌రైన నాణ్య‌త ఉండ‌టం లేదు కాబ‌ట్టి తాను ముఖ్య‌మంత్రి అయితే స‌రుకుల‌కు బ‌దులు ఏకంగా ప్ర‌తీ నెల రూ. 2500-3 వేల మ‌ధ్య డ‌బ్బునే బ‌దిలీ చేస్తార‌ట‌.  మ‌హిళ‌లంద‌రికీ ఉచిత గ్యాస్ స‌ర‌ఫ‌రా  చేస్తారట‌.  గుజ‌రాత్ కు వెళుతున్న కేజి బేసిన్ గ్యాస్ ను అడ్డుకోగలిగితే  ఉచిత గ్యాస్ ఇవ్వ‌టం క‌ష్టం కాద‌ని చాలా తేలిగ్గా చెప్పేశారు. కేజి బేసిన్ గ్యాస్ ను అడ్డుకుంటే క‌దా తెలిసేది ఏమ‌వుతుందో ?  ఇక‌,  బాగా వివాదాస్పద‌మైన కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంపైన కూడా హామీ ఇచ్చేశారులేండి. కాపుల‌ను బిసిల్లో చేర్చే అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చుచుతార‌ట‌.


మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ఎవ‌రి పరిధిలోనిది ?

janasena-pawan-kalyan-sample-manifesto-2019-electi

బిసిల రిజ‌ర్వేష‌న్ క్యాట‌గిరీలోకి కాపుల‌ను  చేర్చాల‌న్న విష‌యం కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలోనిది.  అలాగే,  కాపుల రిజ‌ర్వేష‌న్ అంశం 9వ షెడ్యూల్లో చేర్చే అంశం కూడా ప‌వ‌న్ చెప్పినంత ఈజీ కాదు. ఇక‌, చట్ట‌స‌భ‌ల్లో  మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌న్న హామీ కూడా సాధ్యం కాదు.  చ‌ట్ట‌స‌భ‌లంటే అసెంబ్లీ, పార్ల‌మెంటే. మ‌హిళా బిల్లు పార్ల‌మెంటులో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పెండింగ్ లో ఉంద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ మ‌రిచిపోయిన‌ట్లున్నారు.   బిసిల‌కు 5 శాతం పైగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే అంశంపై కూడా హామీ ఇచ్చారు. నిజానికి కాపుల‌ను బిసిల్లో చేర్చే అంశ‌మే సాధ్యం కాద‌ని అందరూ నెత్తీ నోరు మొత్తుకుంటుంటే ఇపుడు ఇపుడు బిసిల‌కు అద‌నంగా 5 శాతం రిజ‌ర్వేష‌న్లంటూ ప‌వ‌న్ మ్యానిఫెస్టోలో పెట్ట‌టాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?  


కేజి బేసిన్ ను అడ్డుకోగ‌ల‌రా ?

janasena-pawan-kalyan-sample-manifesto-2019-electi

ట్ర‌య‌ల‌ర్ గా ప‌వ‌న్ వ‌దిలిన మ్యానిఫెస్టోలోని చాలా అంశాలనే  అమ‌లు చేయ‌టం సాధ్యం కాదన్న విష‌యం తేలిపోయింది.   రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండే అంశాలైతే ఏదో కిందా మీద ప‌డి అమ‌లుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంతేకానీ రిజ‌ర్వేష‌న్ల అంశ‌మ‌న్న‌ది కందిరీగ‌ల తుట్టె లాంటిది. రిజ‌ర్వేష‌న్ల‌లో మార్పులు చేయాలంటే  కేంద్రం ఒప్పుకోవాలి. రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌ర‌గాలి. చివ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి సంత‌కమైనా సుప్రింకోర్టు అంగీక‌రించాల్సుంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల‌ను సుప్రింకోర్టు కొట్టేసిన విష‌యం ప‌వ‌న్ కు తెలీదేమో ?   ఇక‌,  కేజీ బేసిన్ గ్యాస్ ను గుజ‌రాత్ కు పోకుండా అడ్డుకోవ‌టం జ‌రిగే ప‌నేనా ?  కేజీ బేసిన్ నుండి  గ్యాస్ అడ్డుకోవ‌టం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ వ‌ల్లే కాలేదు.   ఇంకో నాలుగు రోజులాగితే మొత్తం మ్యానిఫెస్టోనే బ‌య‌ట‌కు వ‌స్తుంది క‌దా ? అప్పుడు చూద్దాం పూర్తి సినిమాను. 


janasena-pawan-kalyan-sample-manifesto-2019-electi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిడిపి, జనసేన పొత్తు ఫైనల్.. మార్చిలో సీట్లపై చర్చలు
ఎడిటోరియల్ : బికాంలో ఫిజిక్స్ కు మొండిచెయ్యి..ఓవర్ యాక్షనే కారణమా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు పై కాపుల వ్యతిరేక ప్రచారం..జ్ఞానోదయమైందా ?
వైసిపిలో చేరిన టిడిపి ఎంఎల్ఏ..మేడా సస్పెన్షన్
హోదాకు సంతకాలు తీసుకోగలరా ?
అగ్రవర్ణాల మధ్య చంద్రబాబు చిచ్చు
ఎడిటోరియల్ :  రిజర్వేషన్లపై చంద్రబాబు సరికొత్త మోసం
ఎడిటోరియల్ : జగన్ పై విషం చిమ్ముతున్న మంత్రులు
ఎడిటోరియల్ : వంగవీటికి అంత సీన్ ఉందా ?
ఎడిటోరియల్ : రాధా రాజీనామా ఎఫెక్ట్..బోండాలో టెన్షన్
ఎన్ఐఏ విచారణే..తేల్చేసిన హై కోర్టు
ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తు పిటీషన్
వైసిపికి వంగవీటి రాజీనామా
ఎన్ఐఏ కేసులో చంద్రబాబుకు షాక్
 ‘యాత్ర’ బయోపిక్ లో జగన్ ?
సత్తెనపల్లిలో అంబటికి పొగ పెడుతున్నారా ?
‘బ్రీఫింగ్’ తర్వాతే విచారణకు హాజరయ్యారా ?
ఎడిటోరియల్ : ఎన్నికల్లోపు టిడిపిలో కీలక మార్పులు
ఎన్ఐఏ వల్లే విదేశీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.