విశాఖ జిల్లాలో ఆయన సీనియర్ నాయకుడు, రెండు మార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన నేత. రూరల్ జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాలలో పట్టున్న, దమ్మున్న లీడర్, అటువంటి నాయకుడు కీలక సమయంలో గాయబ్ అయితే ఆయనను నమ్ముకున్న పార్టీ ఏమవుతుంది. క్యాడర్ కి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి. గత పది రోజులుగా ఆ రాజా వారు కనిపించడం లేదట. అసలేం జరుగుతోందక్కడ...?


టైం చూసి మరీ :


ఓ వైపు వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకమైన పాదయాత్ర విశాఖ జిల్లాలోకి మరి కొద్ది గంటలలో అడుగుపెడుతోంది. ఇప్పటికి జరిగిన పది జిల్లాలకూ తీసిపోని విధంగా గ్రాండ్ గా  స్వాగతం పలకాలని వైసీపీ నాయకులు బీభత్సమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో వైపు నాయకులంతా ఒకే మాటగా ఉండాలని మొత్తం టూర్ ని సక్సెస్ చేయాలని ఆదేశాలూ వెళ్ళాయి. ఇంతలో ఇలా జరిగింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు గాయబ్ అయిపోయారు. 



బెదిరింపులు మొదలయ్యాయా :



విశాఖ జిల్లాలో కన్నబాబు రాజుకు గట్టి పట్టుంది. పోయిన ఎన్నికలలో ఆయన టీడీపీలో చేరడంతో ఎలమంచిలి, పాయారావుపేట అసెంబ్లీ సీట్లను టీడీపీ సునాయాసంగా గెలుచుకుంది. ఆ తరువాత ఎమంల్సీ ఇస్తానని చెప్పి బాబు చేయి ఇవ్వడంతో రాజు గారు రూట్ మార్చి రెండు నెలల క్రితం వైసీపీలోకి చేరిపోయారు. జగన్ పాదయాత్రలో విశేష పాత్ర పోషిస్తారని, మొత్తం రూరల్ జిల్లాలో ఉన్న టీడీపీ క్యాడర్ ని ఫ్యాన్ వైపుగా మళ్ళిస్తారని ఎంతో ఆశలు పెట్టుకుంతే టైం చూసి మరీ రాజు గారు జెండా ఎత్తేశారని సెటైర్లు పడుతున్నాయి. దీని వెనక బలమైన కారణం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు



రాజు గారి పై కాంగ్రెస్  టైం నుంచి కొన్ని కేసులు ఉన్నాయి. అప్పట్లో ఆయన టీడీపీలో చేరడంతో ఆ కేసులు అలా పక్కకు పోయాయి. మళ్ళీ వైసీపీలో యాక్టీవ్ గా తిరగడం, పైగా  రూరల్ లో టీడీపీ పట్టున్న చోట దెబ్బ కొట్టేందుకు   రాజు గారు వ్యూహాలు పన్నడంతో అయనపై మళ్ళీ పాత కేసులు తిరగతోడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ పాదయాత్ర సక్సెస్ కాకుండా ఉండేందుకే రాజు గారిని అలా బెదిరించి సైడ్ చేయించారని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉన్నాయి. జగన్ పాదయాత్ర కు ఆది లోనే ఇలా బ్రేకులు వేయాలని టీడీపీ వేస్తున్న ఎత్తులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: