ముద్ర గదా పద్మ నాభం ఎప్పుడు లేని విధంగా జగన్ మీద విరుచుకు పడుతున్నారు. అయితే ఎప్పుడు లేనిది ఈ విధముగా ముద్ర గడ జగన్ మీద ఎందుకు కక్ష కడుతున్నాడని ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ముద్ర గడ జగన్ మీద రెచ్చి పోవడానికి కారణం వేరే ఉందని ఇప్పుడు అర్ధం అవుతుంది. జ‌గ‌న్‌పై ముద్రగ‌డ తీవ్రంగా ర‌గ‌లిపోవ‌డం వెనుక బ‌ల‌మైన క‌థే న‌డిచింది. ముద్రగ‌డ‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని వైసీపీ నేత‌లు నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఇత‌ర నేత‌లు ముద్రగ‌డ‌ను క‌లిశారు.

Image result for mudragada padmanabham

వైఎస్ జ‌గ‌న్ ఆకాంక్ష మేర‌కు వైసీపీలోకి ఆహ్వానించేందుకు వ‌చ్చామ‌ని, మీ అభిప్రాయాన్ని చెప్పాల‌ని ముద్రగ‌డ‌ను వారు కోరారు. వైసీపీలో చేరేందుకు సుముఖ‌త వ్యక్తం చేసిన ముద్రగ‌డ త‌న మ‌న‌సులో మాట‌ను వారి ముందు ఉంచారు. రాష్ర్టవ్యాప్తంగా తానుచెప్పిన వారికి 30 సీట్లు ఇవ్వాల‌నే డిమాండ్‌ను వారి ఎదుట వ్యక్తప‌రిచార‌ని విశ్వస‌నీయ స‌మాచారం. త‌మ అధినేత‌తో మాట్లాడి అభిప్రాయాన్ని చెబుతామ‌ని అక్కడి నుంచి వైసీపీ కాపునేత‌లు వ‌చ్చారు.

Image result for jagan

ముద్రగ‌డ‌తో జ‌రిగిన చ‌ర్చల సారాంశాన్ని జ‌గ‌న్ ముందు ఉంచారు. మీరే నిర్ణయం తీసుకోండ‌న్నా అని బొత్సకే ముద్రగ‌డ చేరిక బాధ్యత‌లు అప్పగించిన‌ట్టు తెలిసింది. ముద్రగ‌డ రాజ‌కీయ చ‌రిత్రను ఒక్కసారి తిరిగేసిన బొత్స స‌త్యనారాయ‌ణ త‌న తుదిమాట‌గా మూడుసీట్లకు అంగీక‌రించే ప‌క్షంలో చేర్చుకోవ‌చ్చని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ ప్రతిపాద‌న‌ను ముద్రగ‌డ ఎదుట ఉంచార‌ని స‌మాచారం. 30సీట్లు అడిగితే మూడు సీట్లు ఇస్తామంటారా అని అల‌కబూనార‌ని తెలిసింది. అప్పటి నుంచి జ‌గ‌న్‌పై ముద్రగ‌డ ర‌గిలిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: