ఈ మద్య ప్రపంచంలో రక రకాల ఛాలెంజ్ లు వస్తున్నాయి.  అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెలబ్రెటీలు ఒకరికొకరు ఈ ఛాలెంజ్ విసురుతూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేశారు..ఆ తర్వాత రైస్ బకెట్, ఫిట్ నెస్ ఛాలెంజ్ లు వచ్చాయి..ఈ మద్య కీకీ ఛాలెంజ్ తో నడుస్తున్న కారు లో నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేయడం వంటి ఛాలెంజ్ లు వచ్చాయి.  అయితే ఇలాంటి ఛాలెంజ్ తో చాలా ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   తాజాగా ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తో ప్రసిద్ద పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్‌ వచ్చారు.  

Image result for raksha bandhan

ఈ మద్య భారత దేశంలో మహిళలపై, యువతులపై చివరకు చిన్నారులపై కూడా కామాంధులు అత్యాచారలు, హత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాటలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడమే లక్ష్యంగా చిలుకూరు ప్రధానార్చకులు యువతకు సరికొత్త ఛాలెంజ్‌ను విసిరారు. వచ్చే రాఖీపౌర్ణమి రోజున పరిచయం లేని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని సవాల్‌ విసిరారు. 

Image result for raksha bandhan

రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి.. యువత అందరికీ ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.   రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ పేరుతో ఆరోజు ప్రతీ అమ్మాయి తనకేమీ సంబంధం లేని అబ్బాయికి రాఖీ కట్టాలని అలాగే పరిచయం లేని అమ్మాయితో అబ్బాయి రాఖీ కట్టించుకోవాలని యూత్‌కు ఛాలెంజ్‌ విసిరారు. ప్రతీ మహిళలో తన అమ్మ, అక్క, చెల్లిని చూడాలని అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలను సోదరులుగా భావించాలన్నారు. ఈ ఛాలెంజ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యిందన్న అర్చకులు రంగరాజన్‌ ఆలయానికి వచ్చిన భక్తులంతా రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారని వివరించారు. 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: