ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలమధ్య ఉంటూ ఎలక్షన్ హీట్ పెంచేశారు.  ఈ క్రమంలో పార్టీ అధినేతలు తమ ప్రసంగాలతో ప్రత్యర్థులకు మరిచిపోయే విధంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగిస్తున్నారు. 2019 ఎన్నికలలో అధికారమే పరమావధిగా ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు దూసుకెళ్ళిపోతున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for jagan

అంతేకాకుండా ఎన్నికలలో నిలబడే పార్టీ అభ్యర్థి వేటలో ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లు పొలిటికల్ వర్గాల నుండి సమాచారం. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పనితీరుపై ప్రజలలో ఇటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి అనేక సర్వేలు నిర్వహిస్తున్నారు.

Related image

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా ఆయె నియోజవర్గాలలో టికెట్ ఎవరికి ఇస్తే బావంటుంది అనేది సర్వే చేసింది. జగన్ ప్రశాంత కిశోరె టీంతో సర్వే చేయించారు. .పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం సమాచారం లేకుండానే ఈ సర్వేను ప్రశాంత్ కిషోర్ టీమ్ పూర్తి చేసింది. వివిధ వర్గాల ప్రజలతో వారు మమేకమై అభిప్రాయాలను సేకరించారు.

Image result for jagan pk

ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు సమాచారం.సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోనే జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని జగన్ భావించారు. పాద‌యాత్ర పూర్త‌యిన త‌ర్వాత నేతలతో జగన్ వరుస భేటీలు ఉండనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జగన్ రాజకీయ సలహాదారుడు  ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వే వైసీపీ పార్టీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: