ఇప్పటికి పది జిల్లాలలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ విశాఖలో అడుగు పెడుతున్నారు. ఉత్తరాంధ్రాను ఊపేయడానికి జగన్ తొలి అడుగు పడుతోంది. తునిలో బస చేసిన జగన్ ఈ రోజు ఉదయం కోటనందూర్ మండలం కాకరాపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. అకడ నుంచి విశాఖ జిల్లా నర్శీపట్నం నాతవరం మండలం గన్నవరం మెట్టకు జగన్ చేరుకవడం ద్వారా ఉత్తరాంధ్ర లో పాదం మోపుతారు.


ఇదీ షెడ్యూల్ :


అక్కడ నుంచి శరభవరం, శ్రుంగవరం చేరుకున్న మీదట మధ్యాహ్నం  భోజనం విరామం ఉంటుంది. తిరిగి రెండు గంటలకు గాంధీనగర్, వై దొంగవరం జంక్షన్, ఎర్రవారం జంక్షన్ మీదుగా జగన్ పాదయాత్ర సాగుతుంది. దాంతో తొలి రోజు పాదయాత్ర ముగుస్తుంది. రాత్రికి జగన్ ఇక్కడే బస చేస్తారు. 


నాలుగు రోజులు ఇక్కడే :


జగన్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు వైసీపీ నాయకులంతా రెడీ అయిపోయారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి నిన్నటి నుంచి నర్శీపట్నంలోనే మకాం వేశారు. ఇక మొత్తం మూడు జిల్లాల నుంచి పార్టీ నాయకులంతా విశాఖ  పొలిమేరలలో జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. 


అయ్యన్నకు గట్టి  జవాబు :


ఈ మధ్య కాలంలో జగన్ పై తరచూ ఘాటు విమర్శలు చేస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడుకు ధీటైన జవాబు ఇచ్చేందుకు జగన్ రెడీగా ఉన్నారు. ఈ నెల్ 18న నర్శీపట్నంలో జరిగే భారీ బహిరంగ సభలో జగన్ అయ్యన్నకు పదునైన కౌంటర్లు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప ను చేర్చుకుంటారని, నర్శీపట్నంలో సీనియర్ నాయకుడు రుత్తల ఎర్రా పాత్రుడు కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అయ్యన్న ఇలాకాలో దడ పుట్టించేలా జగన్ పాదయాత్ర సాగుతుందని భోగట్టా..


మరింత సమాచారం తెలుసుకోండి: