జగన్ ఉత్తరాంధ్రలో కాలు మోపకుండానే టీడీపీలో ప్రకంపనలు మొదలవుతున్నాయి. జగన్ ప్రభంజనం  ఇక్కడ అధికార పార్టీని ఒక కుదుపు కుదుపుతోంది. మాజీ, తాజా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చాలామంది వైసీపీలో  చేరెందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఈ వరసలో మంత్రి సోదరుడొకరు ఉన్నారని తెలుస్తోంది. అంతే కాదు, ఓ ఎంపీ కూడా చెరే విషయంలో ఊగిసలాడుతున్నా చివరకు ఇటే వస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.


అక్కడ షాక్ :


ఎంతో మోజు మీద విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి రాజ వంశాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చామని మురిసిపోతున్న పసుపు పార్టీకి షాక్ తగిలే పరిణామం ఒకటి జరగబోతోంది. జిల్లా మంత్రి సుజయ క్రిష్ణ రంగా రావు సోదరుడు బేబీ నాయన తిరిగి వైసీపీ గూటికి చేరుతారని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి. మంత్రి కుటుంబం నుంచే వలసలు మొదలైంతే ఇక పార్టీ నాయకులను ఆపడమెలా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.


ఇటు వైపే చూపు :


ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ ఎంపీ వైసీపీ లో చేరేందుకు దాదాపుగా డిసైడ్ అయ్యారు. అయితే చివరి నిముషంలో చంద్రబాబు జోక్యం చేసుకుని బ్రేక్ వేశారని భోగట్టా. అయితే జగన్ దాదాపు మూడు నెలల పాటు ఇక్కడె ఉండబోతున్నారు. అందువల్ల ఆయనతో సహా టీడీపీలోని పలువురు పెద్ద తలకాయలు కూడా ఫ్యాన్ నీడకు వస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ లో మిగిలిన అర కొర నాయకులు సైతం ఇటు వైపు చూస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయం  జగన్ పాదయాత్ర నేపధ్యంలో హీటెక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: