చిన‌బాబు నారా లోకేష్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉచిత స‌ల‌హా ఇచ్చారు.  నిడ‌ద‌వోలు, తాడేప‌ల్లి గూడెం బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్ చాలా ఆవేశంగా  మాట్లాడారు లేండి.  ఈమ‌ధ్య ఎక్క‌డ మాట్లాడినా లోకేష్ పై ప‌వ‌న్  విరుచుకుప‌డుతున్న సంగ‌తి అంద‌రూ  చూస్తున్న‌దే.  అటువంటి ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌ల్లో మాత్రం లోకేష్ కు   ఒక ఉచిత స‌ల‌హా  ఇచ్చారు.


వాళ్ళ‌ని ఆద‌ర్శంగా తీసుకుంటే ఏమొస్తుంది ?


ఇంత‌కీ ఆ స‌ల‌హ ఏమిటంటే, లోకేష్ త‌న తండ్రి చంద్ర‌బాబును కాకుండా మ‌హాత్మా గాంధి,  అబ్ర‌హం లింక‌న్, కెనడీ, అల్లూరి సీతారామ‌రాజు,  స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ లాంటి వాళ్ళ‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ట‌. తండ్రి చంద్ర‌బాబును ఎందుకు ఆద‌ర్శంగా లోకేష్ తీసుకోకూడ‌దో మాత్రం ప‌వ‌న్ చెప్ప‌లేదు. అదే సంద‌ర్భంగా  పైన చెప్పిన వారినే  లోకేష్ ఎందుకు ఆద‌ర్శంగా తీసుకోవాలో  ప‌వ‌న్ వివ‌రించి ఉంటే బాగుండేది.  


ఎంఎల్సీ, మంత్రి ప‌ద‌వి ద‌క్కేదేనా ?

Related image

ఎదుగుతున్న పిల్ల‌ల్లో చాలా వ‌ర‌కూ త‌మ తండ్రినో  లేకపోతే త‌ల్లినో ఆద‌ర్శంగా తీసుకోవ‌టం చాలా ఇళ్ళ‌ల్లో జ‌రిగేదే.  ఇప్ప‌టికీ త‌న త‌ల్లి గొప్ప‌ద‌నం గురించి ప‌వ‌న్ చెబుతున్నారంటే చిన్న‌పుడు త‌న త‌ల్లిలోని సుగుణాలను గ‌మ‌నించ‌కపోతే ప‌వ‌న్ కు సాధ్య‌మ‌య్యేది కాదు క‌దా ?  అంటే ప‌వ‌నేమో త‌న త‌ల్లిని ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చు కానీ లోకేష్ మాత్రం త‌న తండ్రి చంద్ర‌బాబును ఆద‌ర్శంగా తీసుకోకూడ‌దా ? అయినా చంద్ర‌బాబులో ప‌వ‌న్ కు న‌చ్చ‌ని గుణాలేంటో కాస్త చెబితే బాగుంటుంది క‌దా ? అయినా ప‌వ‌న్ చెప్పిన వాళ్ళ‌ని లోకేష్ ఆద‌ర్శంగా తీసుకుంటే ఏమొస్తుంది ?   ప‌వ‌న్ చెప్పిన‌ట్లు లోకేష్ త‌న తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఉండ‌క‌పోతే   ఎంఎల్ఏ కాకుండా ఎంఎల్సీ అయ్యేవారేనా ?  ఎంఎల్సీ కాగానే దొడ్డిదారిన మంత్రివ‌ర్గంలో చోటు సంపాదించేవారేనా ? అయినా ఈనాటి రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబే క‌రెక్టుగా ఫిట్ట‌వుతారు కానీ  తాను  చెప్పిన వారు  ఎందుకూ ప‌నికిరారన్న విష‌యం ప‌వ‌న్ కు మాత్రం తెలీదా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: