జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడేం మాట్లాడుతున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు.  ప‌వన్ మాటల్లో ఆవేశ‌మే త‌ప్ప ఓ ప‌ద్ద‌తంటూ ఉండ‌టం లేదు. ఏదో అంశంపై మొద‌లుపెట్టి ఇంకేదో అంశంలోకి వెళ్లిపోతారు. ఒక అంశంపై మాట్లాడుతూ ఇంకో విష‌యంలోకి మారిపోతారు. మొత్తం మీద ప‌వ‌న్ ఏం మాట్లాడుతున్నారో అర్ధంకాక జ‌నాలు జుట్టు పీక్కుంటుంటారు.  మీడియా స‌మావేశంలో ఇలా  చాలా సార్లే జ‌రిగింది.  


అంద‌రిలోనూ అయోమ‌యం


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా ఎవ‌రుండాలో తేల్చుకోమంటూ జ‌నాల‌కు ప‌వ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల‌తో త‌న‌కున్న పోలిక‌లు, తేడాలు చెబుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ  ప‌వ‌న్ మాత్రం హ‌టాత్తుగా వెన్నుపోటు రాజ‌కీయాలు గురించి మొద‌లుపెట్టారు. వెన్నుపోటు రాజ‌కీయాల‌న‌గానే అంద‌రికీ ఎవ‌రు గుర్తుకు వ‌స్తారో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు.  ఆ విష‌యాల గురించే మాట్లాడుతార‌ని అంద‌రూ అనుకుంటే చివ‌ర‌కు లోకేష్ కు వార్నింగ్ ఇవ్వ‌టంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. వెన్నుపోటు ద్వారా సిఎం అవ్వాల‌నుకుంటే తాను ఒప్పుకోనంటూ లోకేష్ ను  ప‌వ‌న్ హెచ్చ‌రించ‌టంతో అంద‌రికీ మ‌తిపోయింది.

లోకేష్ పై  అనుమానాలు

Related image

రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా ఎవ‌రుండాలో మీరే నిర్ణయించుకోండి ? అంటూ పెద్ద ఆఫ‌రే ఇచ్చారు.  చంద్ర‌బాబా ? జ‌గ‌నా ?   నేనా ?  మీరే నిర్ణ‌యించుకోండి అంటూ జ‌నాల‌కు పిలుపిచ్చారు. వెన్నుపోటు పొడ‌వ‌టం చంద్ర‌బాబుకు అల‌వాటన్నారు. లోకేష్ కూడా వెన్నుపోటుతో  సిఎం అవ్వాల‌ని అనుకుంటే కుద‌ర‌దంటూ వార్నింగే ఇచ్చారు. లోకేష్ వెన్నుపోటు పొడ‌వ‌టం  ద్వారా సిఎం అవ్వాల‌ని అనుకుంటున్నారా ?  ప‌వ‌న్ మాట‌లు చూస్తుంటే అంద‌రిలోనూ కొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. లోకేష్ సిఎం అవ్వాల‌ని అనుకుంటే ఎవ‌రిని వెన్నుపోటు పొడుస్తారు ?  తండ్రి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడును వెన్నుపోటు పొడిచి సిఎం అవ్వాల‌ని లోకేష్ అనుకుంటే ప‌వ‌న్ కు వ‌చ్చే న‌ష్టమేంటి ? 


ప‌వ‌న్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ?

Image result for pawan and lokesh

వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు ఎన్టీఆర్ లా తాను అమాయ‌కుడిని  కానంటూ పెద్ద వార్నింగే ఇచ్చారు.  ప‌వ‌న్ వార్నింగ్ చూస్తుంటే అంద‌రిలోనూ ప‌వ‌న్ మాన‌సిక ప‌రిస్ధితిపై అనుమానాలు మొద‌ల‌య్యాయి. అస‌లు ఇపుడు ముఖ్య‌మంత్రెవ‌రు ? చ‌ంద్ర‌బాబా ?  లేక‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణా ?  లోకేష్ సిఎం అవ్వాల‌నుకుంటే వెన్నుపోటు పొడ‌వాల్సింది చంద్ర‌బాబునా ?  లేక‌పోతే ప‌వ‌న్నా ? అన్న విష‌యం ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. రాజ‌కీయాల్లో తాడు  బొంగ‌రం లేని ప‌వ‌న్ ను లోకేష్ వెన్నుపోటు పొడవ‌ట‌మేంటి ?  ప‌వ‌న్ కు ఏముంద‌ని లోకేష్ వెన్నుపోటు పొడ‌వాలి ?  పైగా వెన్నుపోటు రాజ‌కీయాల‌పై జ‌న‌సైనికులు తిర‌గ‌బ‌డ‌తారంటూ అసంద‌ర్భంగా హెచ్చ‌రిక‌లొక‌టి ? ఏంటో వ‌ప‌న్ మాట‌ల్లో ఆవేశ‌మే త‌ప్ప ఆలోచ‌న ఉన్న‌ట్లు క‌న‌బ‌డ‌టం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: