Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 1:52 am IST

Menu &Sections

Search

టిడిపిని 38 స్థానాలకే పరిమితం చేయనున్న అనుకూల మీడియా & అధినేత (కుల) సమాజం

టిడిపిని 38 స్థానాలకే పరిమితం చేయనున్న అనుకూల మీడియా & అధినేత (కుల) సమాజం
టిడిపిని 38 స్థానాలకే పరిమితం చేయనున్న అనుకూల మీడియా & అధినేత (కుల) సమాజం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒక కులానికి చెందిన నలుగురు పెద్దలు కూర్చొని వ్యూహం రూపొందించటం ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను రాజకీయంగా శాసిస్తుందనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కథనం. దీని ద్వారా అర్ధమయ్యెదేమంటే మనది ప్రజాస్వామ్యపాలన కాదని కులస్వామ్యంలో బ్రతుకీడే రుస్తున్నామనేదే. లౌకిక వాదం, మతసామరస్యం, ప్రజాస్వామ్య సమాజం, సమానత్వం అంటూ మనం చెప్పుకునే సొదంతా ఉత్త పోచుకోలు కబుర్లేనని నిర్ద్వంధంగా తెలుస్తూనే ఉంది.

ap-news-kula-swamyam-no-demacracy-tdp-support-medi

సార్వత్రిక ఎన్నికలు త్వరలో రానుండడంతో ఏపీలో రాజకీయ వేడి మొద లైంది. పార్టీల్లో చేరిక లు, ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్‌ల పర్వం జోరుగా సాగుతోంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ కంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడిన వైసీపీకి ఎక్కువ ఆదరణ లభిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


అలుపెరుగని పోరాటంలా వైసీపీ అధినేత జగన్‌ సంకల్పయాత్రను నిర్వహిస్తు న్నారు. ఈ యాత్ర తో ప్రజలను నేరుగా కలుసుకుంటూ ప్రభుత్వం తీరును, తాము అధికారం లోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తు న్నారు. దీంతో జనాల్లో ఆదరణ పెరుగుతోందని వారు అంటున్నారు. నీన్నసోమవారం వరకు  వైఎస్ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర 236వ రోజుకు చేరుకుంది. వేల కిలోమీటర్లు నడిచిన ఈ యాత్రతో గ్రామీణులు వైఎస్ జగన్‌ కు నిరాజనాలు పడుతున్నారు. దీంతో మిగతా పార్టీల్లోని ద్వితీయ, తృతీయ  శ్రేణి నాయకులు వైసీపీలో మూకుమ్మడిగా చేరు తున్నారు. ఇది ప్రత్యక్షంగా కనిపించే నిఖార్సైన నిజం.

ap-news-kula-swamyam-no-demacracy-tdp-support-medi

వైసీపీ నేతలు చెబుతున్నట్టు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పగలు పూట కాంగ్రెస్  రాతృళ్ళు బీజేపీతో రాజకీయంగా శయనిస్తూ, చక్కగా ఇరు పార్టీలను సంయమనంతో సంతృప్తి పరచటంలో మునిగిపోయారు. ధర్మ పోరాటం, నిరాహార దీక్షలు, అంటూ ఆయన చెసే ప్రతి పగటి వేషాలు , గారడీలు ప్రజలకు విసుగు పుట్టిస్తు న్నాయి. ప్రభుత్వమే ఆయనది. పాల నే ఆయనది ఎవరిమీద ఈయన చెసే పోరాటాలు ఉద్యమాలు అని సర్వత్రా జనం విసుక్కుంటున్నారు.  


అయితే ఒక దిన పత్రిక చంద్రబాబు రాజకీయంపై సంచలన కథనాన్ని ప్రచురించింది. వైఎస్‌ భారతీ పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చేలా చేయడం వెనుక ఉన్న అసలు కథను వివరించింది.

ap-news-kula-swamyam-no-demacracy-tdp-support-medi

ఆ పత్రిక కథప్రకారం ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటికీ ఇటీవల ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఎదుర్కొని నిలవాలంటే టిడిపి ఒంటరి పోరు చేస్తే సరిపోదట. కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీలతో జతకట్టక తప్పని పరిస్థితి నెలకొని ఉందని, అందుకే కాంగ్రేస్ పార్టీతో జత కడుతున్నట్లు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలకు సమాచారమిచ్చారట.ఎన్నికల తర్వాత తిరిగి ఎన్‌డీఏ గూటికి వస్తామని దూతల ద్వారా నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలకు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పరిస్థితులను అర్థం చేసు కుని సహకరించాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు కోరారట.


ఈ నేపథ్యంలోనే రామోజీ రావు, అమిత్ షాల ఏకాంత భేటీ జరిగింది. ఆ తర్వాతి కొన్ని రోజులకే రామోజీ ఫిల్మింసిటీలో టీడీపీకి అండగానే నిలిచే  అధినేతల సామాజిక వర్గం వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. వనభోజనాలకు వచ్చిన కులపెద్దలు రాజకీయ పరిస్థితిపై చర్చించారు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో టీడీపీ ముఖాముఖి తలబడితే వైసిపికి టిడిపి కంటే 10 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని వారి సర్వేలో తేలినట్టు వనభోజనాలకు వచ్చిన పెద్దలు అధినేతలకు వివరించారు. వైసీపీకి 132 స్థానాలు వస్తాయని,టీడీపీకి 28కి మించి వచ్చే పరిస్థితి లేదని వివరించారు. కాబట్టి కాంగ్రెస్‌, ఇతర పార్టీల సాయంతోనే వైసీపీని ఎదుర్కోవాల్సి ఉంటుం దని వనభోజనాల వద్ద పెద్దలు చర్చించుకున్నారు.


ఎన్నికల తర్వాత తిరిగి ఎన్‌డీఏ గూటికి వస్తామని బీజేపీ పెద్దలను నారా చంద్రబాబు నాయుడు ఒప్పించిన తర్వాతే వైఎస్ భారతీ పై ఈడీ కేసుల తంతు మొదలైందని వివరించింది. ఇప్పుడు టిడిపికి మద్దతు నిచ్చే సామాజిక వర్గం గాని అనుకూల మీడియా చూపే చిత్రాలు, చేసే గారడీలు నీటిమీద రాతలేనని తెలిపోనుందనేది విశ్లేషకుల వాదన.. 

ap-news-kula-swamyam-no-demacracy-tdp-support-medi

ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పటి నుంచి ప్రత్యేక హోదాపై మొదటగా పోరు మొదలుపెట్టింది వైసీపీయేనని, ఇప్పుడు అన్ని పార్టీలు ఆ బాటలోనే నడుస్తున్నాయని, అదే పాట పాడుతూ కాపీ కొడుతున్నారని కూడా వైఎస్ జగన్‌ ప్రచారం చేయడంతో నాయకులు మనసు మార్చుకుంటున్నారు.


వైపీసీ బలం రోజు రోజుకు పెరిగిపోతుంది. త్వరలో జరిగే ఎన్నికల వరకు మిగతా పార్టీల్లో కులాల కుంపట్లు, మనస్పర్థలతో అవన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి. కుల మత ప్రాంత రాజకీయాలతో అసంతృప్తులైన వారంతా  వైసీపీలోకి పరుగులు పెట్టడం ఖాయమని  సీనియర్‌ నేతలంటున్నారు. అందుకే ముందే సీటు ఖాయం చేసు కుంటే ఆ తరువాత ఇంకా పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంటుందని నేతలు ఆలోచిస్తున్నారు.


చివరకు ఆంధ్రుల ఆత్మాభిమానంతో, కాంగ్రెస్ కంచుకోటలు కూలుస్తూ, కులం మతం ప్రాంతం అనే విభేధాల గోడలు కూల్చివేస్తూ,  పుట్టి పెరిగి  ఎదిగిన నందమూరి తారక రామారావు నిర్మించిన తెలుగుదేశం పార్టీ చివరకు ఒక సామాజిక వర్గానికే పరిమితం అవనుందనేది కూడా విశ్లేషకుల వాదన. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యొతి క్రమం తప్పకుండా చదివే వారిని ఇరుగు పొరుగు వారు మీరు తెలుగుదేశం పార్టీ వారా? లేక ఆ కులం వారా? అని అడిగే స్థాయికి ఆ టిడిపి అనుకూల మీడియా తనను తాను దిగజార్చుకుంది.

ap-news-kula-swamyam-no-demacracy-tdp-support-medi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
About the author