చంద్ర‌బాబునాయుడును బిజెపి నేత జివిఎల్ న‌ర‌సింహ‌రావు వెంటాడుతున్నారు.  పిడి ఖాతాల్లో వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంపై  సిబిఐ విచార‌ణ చేయించాలంటూ  బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ను డిమాండ్ చేశారు.  పిడి ఖాతాల్లో కుంభ‌కోణం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో జివిఎల్  చాలా రోజులుగా చంద్ర‌బాబు వెంట‌ప‌డుతున్నారు జివిఎల్.


సిబిఐతో విచార‌ణ చేయించాలి 

Image result for cbi logo

తాజాగా అదే విష‌యం మీద  చంద్ర‌బాబుపై జివిఎల్ ఫిర్యాదు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.  గ‌వ‌ర్న‌ర్ కున్న విచ‌క్ష‌ణాధికారాల‌ను ఉప‌యోగించాల‌ని జివిఎల్ కోరారు. పిడి ఖాతాల్లో జ‌మైన వేలాది కోట్ల రూపాయ‌ల‌పై సిబిఐతో విచార‌ణ చేయించి నిజాలు బ‌య‌ట‌పెట్టాలంటూ జివిఎల్ డిమాండ్ చేశారు.  2016-17కు సంబంధించిన పీడీ ఖాతాల‌ను కాగ్ తో ప్ర‌త్యేకించి ఆడిట్ చేయించాల‌ని డిమాండ్ చేశారు 


గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణ ఉప‌యోగించాలి 

Image result for governor narasimhan

త‌న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ చేయించ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని కూడా జివిఎల్ ఆరోపించారు.  కాబ‌ట్టి గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని  ఆయ‌న కోరారు. రూ. 58,539 ఖాతాల్లో రూ. 53 వేల కోట్ల‌ను డిపాజిట్ చేసిన‌ట్లు వివ‌రించారు. బీహార్  లో  బ‌య‌ట‌ప‌డిన దాణా కుంభ‌కోణం క‌న్నా పిడి ఖాతాల కుంభ‌కోణం చాలా పెద్ద‌ద‌ని ఆరోపించారు.  అందులో రూ. 51448 వేల కోట్ల‌ను ధ‌ర్డ్  పార్టీల‌కు చెల్లించిన‌ట్లు ఆరోపించారు. నిబంధ‌ల‌ను ఉల్లంఘించి 63 సెల్ఫ్ చెక్కుల ద్వారా రూ. 258 కోట్లు విత్ డ్రా చేసిన‌ట్లు ఆరోపించారు. కాబ‌ట్టి  వెంట‌నే  పీడీ ఖాతాల కుంభ‌కోణంపై సిబిఐ విచార‌ణ చేయించాల‌ని జివిఎల్ గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాయ‌టం సంచ‌ల‌నంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: