వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో ఈ రోజు అడుగుపెట్టారు. ఆయనకు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. నర్శీపట్నం నియోజక వర్గంలో ఇలా అడుగు పడిందో లేదో మంత్రి  అయ్యన్నపాత్రుడికి అలా షాక్ తగిలింది. అయ్యన్న  ఇలాకాలో గట్టి పట్టున్న ప్రజా నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రుత్తల ఎర్రా పాత్రుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. జగన్ స్వయంగా అయనకు కండువా కప్పి మరీ ఆహ్వానించారు.


ముందే రాయబారం :


జగన్ జిల్లా టూర్ కి ముందే రుత్తల ఎర్రా పాత్రుడితో విజయసాయిరెడ్డి రాయబారం నడిపారు. వైసీపీలో ఛేరాలని కోరారు. పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఎర్రా పాత్రుడు ఇటు వైపు మొగ్గారని చెబుతున్నారు. గతంలో అయ్యన్న పై పోటీ చేసిన ఎర్రా పాత్రుడు గణనీయమైన ఓట్లను తెచ్చుకున్నారు. అనేక ప్రజా పోరాటాలు చేసిన ఆయన కూడా మంత్రి సామజిక వర్గమే కావడంతో పాటు అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారు.
ఎర్రా  పాత్రుడి రాకతో వైసీపీకి మంచి బలం నర్శీపట్నంలో సమకూరుతుంది. అదే టైంలో ఈసారి ఎలాగైనా  అయ్యన్నను ఓడించాలన్న జగన్ పంతమూ నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి జగన్ రాకతో తొలి దెబ్బ సీనియర్ మంత్రి పైనే పడిందని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: