ఒకప్పుడు దొంగతనాలు అర్థరాత్రి పూట కొంత మంది ముసుగు వేసుకొని..ఇంట్లో వారిని బెదిరించి తాళాలు పగలగొట్టి దోచుకు వెళ్లేవారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ గజదొంగలు భారీ స్థాయిలో ఇళ్లు,షాపులు, బ్యాంకుల్లో పడి దోచుకు వెళ్తున్నారు. కానీ  ఈ మద్య దొంగలు చాలా స్మార్ట్ తయారయ్యారు..ఉన్న చోటనే ఉంటూ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ తమ అకౌంట్స్ లోకి డబ్బులు పడేలా చేస్తున్నారు.  తాజాగా మహారాష్టలో దారుణం జరిగింది. పూణేలోని కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్ ను హ్యాక్ చేసిన నిందితులు ఏకంగా రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. 

అంతే కాదు ఈ అకౌంట్స్   భారత్ తో పాటు హాంగ్ కాంగ్ లోని పలు అకౌంట్లకు మళ్లించారు. హ్యాకర్లు తొలుత ఈ నెల 11న బ్యాంకుపై పంజా విసిరారు.  మొదట బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసి రూ.78 కోట్లు స్వాహాచేశారు.  ఆ తర్వాత మరోదాడిలో రూ.14 కోట్లు తమ అకౌంట్స్ లోకి మళ్లించారు. 

అలాగే..నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) నుంచి భారత్ లోని ఓ అకౌంట్ లోకి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇలా రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంక్ నుంచి కొట్టేశారు.  కాగా, ఈ ఘటనలో ఏఎల్ఎమ్ ట్రేడింగ్ లిమిటెడ్ తో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: