మన సమాచార సాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ రోజు ఓ మంచి మాట చెప్పారు. కనీసం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైనా నాయకులు నిజాలు మాట్లాడాలి   అని. అంతే కాదు ప్రధాని మోడీ ఆ రోజున ఎర్ర కోటపై చేసే  ప్రసంగంలో అన్ని నిజాలే చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.


హామీలు అమలులో విఫలం :


కేంద్రంలోని  మోడీ సర్కార్ హామీల అమలులో విఫలమైందని మంత్రి గారు ఘాటుగానే విమర్శించారు. అదీ ఒప్పుకోవాల్సిన విషయమే. మోడీ పాలనలో దేశం 20 ఏళ్ళు వెనక్కు వెళ్ళిందన్నారు. ఆర్ధిక నేరస్తులు దేశం విడిచి పారిపోయారట. విదేశాల నుంచి నల్ల ధనం వెనక్కు తీసుకురాలేదుట. కేవలం ప్రచారం  కోసం మోడీ సర్కార్ నాలుగు వేల పై చిలుకు సొమ్ముని  ఖజనా నుంచి ఖర్చు చేసిందంట.


ఈయన సంగతేంటో :


ఇదంతా బాగానే ఉంది మన ముఖ్యమంత్రి గారి మాటేంటో.. మోడీ ఫెయిల్యూర్   పీఎం అయితే ఏపీలో బాబు కూడా ఫెయిల్యూర్   సీఎం కాదా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఆరు వందల పైగా హామీలు గుప్పించి పది శాతం కూడా బాబు నెరవేర్చలేదంటూ విపక్షాల విమర్శలు మంత్రికి వినిపించడంలేదా అంటున్నారు. ప్రచార ఆర్భాటంలో మోడీకి బాబు కూడా ఎక్కడా తీసిపోరన్నది తెలిసిందేనని కౌంటర్లూ పడుతున్నాయి. 


నిజం చెబుతారా :


జెండా పండుగ వేళ శ్రీకాకుళం వస్తున్న చంద్రబాబు ఆ రోజునైనా నిజాలు చెబుతారా అని ఏపీ జనం కూడా ఎదురుచూస్తున్నారు. లేదా ఆ మీటింగ్ కూడా ఓ ధర్మ పోరాట దీక్ష,  గ్రామ  దర్శిని స్పీచుల మాదిరిగా రోటీన్ గానే రాజకీయమే చెబుతారా  అని కూడా డౌట్లు వస్తున్నాయి. మరి మోడీ మీద  మంత్రి ఒక వేలు చూపించారు, కానీ ఏపీ జనాలూ మోడీ, బాబూ జోడీ ని కలిపి చూ స్తున్నారు. అడుగుతున్నారు. మరి దీనికి మంత్రి గారు ఏమంటారో 


మరింత సమాచారం తెలుసుకోండి: