పవన్ ను రాజకీయంగా ఎవరైనా విమర్సించాలనుకుంటే ప్రతి ఒక్కరు అతని పెళ్లిళ్లు గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యర్థి నాయకులూ విమర్శిస్తున్నట్టు అతను అన్ని పెళ్లిళ్లు చేసుకొని ఉండొచ్చు కానీ రాజకీయం లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడటడం ఎంత వరకు కరెక్ట్ అని కొంత మంది ఆరోపిస్తున్నారు. అయితే  జ‌న‌సేన అనే పార్టీని 2014 ఎన్నిక‌లప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయనేత మోడీల‌పై గౌర‌వం, ప్రేమ‌, ఇష్టం... ఇలా పేర్లు ఏవైనా కావ‌చ్చు... వారికి మ‌ద్దతుగా విస్తృతంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రచారం నిర్వహించారు.

Image result for pavan kalyan jansena

ప‌వ‌న్ ప్రచారం టీడీపీకి బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఏపీలో చంద్రబాబుకు అధికారం ద‌క్కింది. దాదాపు మూడున్నరేళ్ల పాటు చంద్రబాబును పొగుడుతూ వ‌చ్చిన ప‌వ‌న్‌లో ఒక్కసారిగా మార్పువ‌చ్చింది. తుపాను తాకిడికి స‌ముద్రం అల్లక‌ల్లోల‌మైన‌ట్టు... ఈ ఏడాది మార్చి 14న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ ప‌వ‌న్ విమ‌ర్శల‌తో టీడీపీలో తుపాను సంభ‌వించిన‌ట్టయింది. మిత్రుడైన ప‌వ‌న్ ఒక్కసారిగా శ‌త్రువు కావ‌డంతో టీడీపీకి కొంత‌కాలం పాటు దిక్కుతోచ‌లేదు. ఊహించ‌ని ఉత్పాతం రావ‌డంతో టీడీపీ తేరుకునే స‌రికి కొంత స‌మ‌యం ప‌ట్టింది.

Image result for pavan kalyan jansena

 అయితే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో సోమ‌వారం పోరాట‌యాత్రలో భాగంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ త‌న పెళ్లిళ్లపై నోరుతెరిచారు.  నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి అడిగిన త‌న‌పై  మూడుపెళ్లిళ్లు చేసుకున్నాననే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక పెళ్లి చేసుకుని తనపై ఆరోపణలు చేసేవారిలా బలాదూర్‌గా తాను తిర‌గ‌డం లేదన్నారు. అంతేకాదు తనకు పొగరు ఎక్కి మూడుపెళ్లిళ్లు చేసుకోలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. కర్మానుసారం జరిగిందానికి ఏం చేయాల‌ని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమైందని క‌న్నీరు పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: