రిడిజైనింగ్ అంటే అవినీతి దోపిడి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రవచించారు. "నీళ్లు, నిధులు, నియామకాలు" అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అధినేతృత్వం లోని టిఆరెస్ ప్రభుత్వం వాటిని సాకారం చేయడం మానేసి జాతి సంపదను రిడిజైన్ చేయటం మొదలెట్టిందని తద్వారా దోపిడి చేసిన ప్రజా సంపద ను అవినీతి మార్గంలో తన కుటుంబ సభ్యుల జెబుల్లోకి దారి మళ్ళించి రాష్ట్రంలో తొలి నాటి నుండే కుటుంబ పాలన కు శ్రీకారం చుట్టిందని  దుయ్యబట్టారు.
rahul speech in saroor nagar stadium కోసం చిత్ర ఫలితం
నిన్న సరూర్‌నగర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విద్యార్థి- నిరుద్యోగ గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఏ కలల కోసం పోరాటం చేశారో ఆ కలలు నెరవేరలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమరుల త్యాగాలను మరచిపోయిందని, అమరుల కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి వారిని మోసం చేశారని మండిపడ్డారు. రాష్టృఅంలోని టీఆర్‌ఎస్‌, కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వాలపై రాహుల్ తన పదునైన విమర్శనాస్త్రాలను సంధించారు. 
rahul speech in saroor nagar stadium కోసం చిత్ర ఫలితం
నీళ్లు, నిధులు, నియామకాలు - తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవన్నీ సద్వినియోగమై తెలంగాణా యువత కలలు సాకారమై అభివృద్ధి ఫలాలు చేతికంది మన ఉద్యోగాలు మనకు వస్తాయనుకున్నాం. బలహీన వర్గాలకు, నిరుద్యోగులకు, రైతులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ, అవన్నీ సాకారం కావడంలేదు. ఏ వాగ్దానాల మీద కేసీఆర్ అధికారంలోకి వచ్చారో అవన్నీ నెవవేరడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు తపించిన వారి కలలు సాకారం కాలేదు’ అని రాహల్ గాంధి అన్నారు. 


తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదని రాహుల్ గాంధి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, నాలుగేళ్లలో కనీసం 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని, వేసిన వాటికి భర్తీ ప్రక్రియ చేపట్టడంలేదని విమర్శించారు.  "రైతుల కోసం కేసీఆర్ నాడు అనేక వాగ్దానాలు చేశారు. కానీ, తెలంగాణా ఆవిర్భావం తరవాత 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. రీ-డిజైనింగ్‌ ల పేరుతో కొత్త రకం దోపిడీ మొదలు పెట్టారు. రైతుల నుంచి భూమిని లాగేసుకుంటున్నారు’ అని రాహుల్ గాంధి విమర్శించారు.
rahul speech in saroor nagar stadium కోసం చిత్ర ఫలితం
‘రీ-డిజైనింగ్ అంటేనే అవినీతి, దోపిడీ అని గతంలో అనేవారు. ఇప్పుడు రీడిజైనింగ్ పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. దేశ ప్రజలకు కాపాలదారుడనని చెప్పుకునే ప్రధాని నరెంద్ర మోదీ పేద ప్రజల డబ్బు లాగేసుకొని బడా పారిశ్రామికవేత్తల ఋణాల మాఫీకి వినియోగిస్తున్నారని అన్నారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో రైతుల భూములు లాక్కుంటారు’ అని రాహుల్ గాంధి విమర్శించారు. 


భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రరంభించిన ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు ను రీ-డిజైనింగ్ పేరుతో కేసీఆర్ సర్కార్ దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు గా మార్చిందని రాహుల్ అన్నారు. ₹30 వేల కోట్ల అంచనా వ్యయంతో తాము రూపొందించిన ప్రాజెక్టును ఏకంగా ₹100 వేల కోట్లకు పెంచారని, టెండర్ల ను కూడా ఆహ్వానించకుండా ఒకే కుటుంబం నిలువునా దోపిడీ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఖమ్మంలోని దుమ్ముగూడెం ఇందిరా సాగర్, రాజీవ్‌ సాగర్ ప్రాజెక్టు లను కూడా రీ డిజైనింగ్ పేరుతో ‘సీతారామా’ ప్రాజెక్టుగా మార్చారని, మాయమాటలు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ₹2500 కోట్ల నుంచి ఒక్కసారిగా ₹12 వేల కోట్లకు పెంచారని రాహుల్ విమర్శించారు. 
rahul speech in saroor nagar stadium కోసం చిత్ర ఫలితం
‘రీడిజైనింగ్ అంటేనే కొత్త రకమైన, దుర్మార్గమైన దోపిడీ. ఈ దోపిడీ గురించి పార్లమెంట్‌ లో ప్రశ్నిస్తే ప్రధాని నరెంద్ర మోదీ సమాధానం యివ్వకుండా పారిపోతున్నారు. నా కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయలేకపోయారు’ అని రాహుల్ గాంధి అన్నారు.  ‘అక్కడ ఒక రీడిజైనర్ నోట్లరద్దుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తే, ఇక్కడ ఈ రీడిజైనర్ దానికి మద్దతు పలుకుతారు. అక్కడ ఆ రీడిజైనర్ గబ్బర్ సింగ్ టాక్స్‌తో చిరు వ్యాపారులను, పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తే, ఇక్కడ ఈ రీడిజైనర్ దానికి వంత పాడుతారు. జీఎస్టీ అద్భుత టాక్స్ అని వాళ్లకు ఎదురెళ్లి చప్పట్లు కొడతారు. ఇద్దరూ చేసేది ఒకే దోపిడీ, అది పేదల డబ్బును దోచుకోవడమే’ అని రాహుల్ విమర్శించారు.  


కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన కేసీఆర్ పేద కుటుంబాల పిల్లలు హైదరాబాద్‌ లో చదివే పరిస్థితి కూడా లేకుండా చేశారని రాహుల్ గాంధీ అన్నారు. పేద విద్యార్థుల జీవితాలు బాగు చేసే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని సీఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.  దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, మైనార్టీ లపై దాడులు పెరుగిపోతున్నాయని రాహుల్ గాంధి ఆందోళన వ్యక్తం చేశారు. నరెంద్ర మోదీ ప్రభుత్వం "భేటీ బచావో.. భేటీ పడావో" అంటూ నినాదం ఇస్తోందని, బాలికల ను ఎవరి నుంచి రక్షించాలో కూడా చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నా మని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు.
rahul speech in saroor nagar stadium కోసం చిత్ర ఫలితం 
రాఫెల్ కాంట్రాక్టును ప్రధాని మోడీ తన స్నేహితుడికి అప్పగించారని రాహుల్ ఆరోపించారు. తన స్నేహితుడు అనిల్ అంబానీకి  రాఫెల్ ప్రాజెక్టును గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పారు.ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి రాఫెల్ ప్రాజెక్టును కట్టబెట్టారని చెప్పారు. రాఫెల్ కుంభకోణంపై నేను ఎక్కడైనా చర్చకు సిద్దం. మోడీతో పాటు అనిల్ అంబానీతో కూడా చర్చకు సిద్దమన్నారు రాహుల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: