చంద్ర‌బాబునాయుడును ఆంధ్రా ద్రోహిగా బిజెపి ఆరోపిస్తోంది. ఈరోజు పార్టీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ, చంద్ర‌బాబుపై ఫుల్లుగా ఫైర‌య్యారు.  రెండు క‌ళ్ళ సిద్ధాంతాన్ని చంద్ర‌బాబు ఇంకా వ‌ద‌లేద‌ని ఎద్దేవా చేశారు.  ఒక‌వైపు ఎన్డీఏలో ఉంటూనే మ‌రోవైపు కాంగ్రెస్ తో పొత్తుల‌కు రెడీ అయ్యార‌ట‌. చంద్ర‌బాబు ఆ ప‌ని చేస్తుంటే బిజెపి నాయ‌క‌త్వం ఏం చేస్తోంది ? 


అధికారం ముందు సిద్దాంతాలేంటి ?


కాంగ్రెస్ తో పొత్తుల‌కు చంద్ర‌బాబు సిద్ద‌మ‌వ్వ‌టం ద్వారా ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు వ్య‌తిరేకంగా టిడిపి ప‌నిచేయ‌ట‌మే అంటూ ధ్వ‌జ‌మెత్తారు.  ఎన్టీఆర్ ఆశ‌యాల గురించి మాట్లాడుతున్న క‌న్నాకు ఇపుడున్న టిడిపి చంద్ర‌బాబు టిడిపి అన్న విష‌యం తెలీదా ?  చంద్ర‌బాబుకు అధికారం అందుకోవ‌ట‌మే త‌ప్ప సిద్దాంతాలు ప‌ట్టుకు వేళాడ‌టం ఇష్టం ఉండ‌ద‌ని తెలీదా ?


ఇటుక‌ల డ‌బ్బులేమ‌య్యాయ్ ?

Image result for amaravati bricks

2014లో కాంగ్రెస్ ను ద్రోహి అన్న చంద్రబాబుకు 2019 క‌ల్లా మంచిదైపోయిందా ? అంటూ నిల‌దీయ‌టం విచిత్రంగా ఉంది. ఎందుకంటే, ఒక‌పుడు బిజెపితో క‌లిసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళిన చంద్ర‌బాబు ఓడిపోయిన త‌ర్వాత బిజెపితో జ‌న్మ‌లో పొత్తు పెట్టుకోనని బ‌హిరంగ‌స‌భ‌లో చేసిన ప్ర‌తిజ్ఞ గుర్తులేదా . అప్ప‌ట్లో ప్ర‌తిజ్ఞ చేసిన చంద్ర‌బాబు మ‌ళ్ళీ 2014లో ఎలా పొత్తుపెట్టుకున్నారు ?  అంటే పొత్తులు పెట్టుకోవ‌టం, విడిపోవ‌టం, మ‌ళ్ళీ చేతులు క‌ల‌ప‌టం చంద్ర‌బాబుకు మామూలే అన్న విష‌యం క‌న్నాకు తెలీక‌పోవ‌ట‌మే విచిత్రంగా ఉంది. బాండ్ల గురించి గొప్ప‌లు చెప్పుకుంటున్న ప్ర‌భుత్వం ఇటుక‌ల పేరుతో వ‌సూలు  చేసిన డ‌బ్బు ఏమ‌య్యాయో చెప్పాలంటూ నిల‌దీయ‌టం స‌బ‌బుగానే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: