వచ్చే ఎన్నికలు యమా రంజుగా ఉండబోతున్నాయి. ఇంతకాలం ఏపీ సీన్ మీద కనిపించని ముఖాలతో పాటు సినీ గ్లామర్ కూడా ఈసారి తళుక్కుమనే అవకాశాలు ఎక్కువంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీల్, వైసీపీలలో తారల హంగామా ఈసారి ఒక రేంజ్ లో ఉంటుందని సమాచారం. పాతతరం అందాల నాయిక, ఉత్తర భారతం నుంచి ఇన్నాళ్ళూ రాజకీయం నెరపిన సీనియర్ నటి  ఈసారి తెలుగు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నట్లు భోగట్టా.


ఆమె వస్తే జోష్ :


పేరులోనే జయం ఉంచుకున్న అలనాటి బ్యూటీ జయప్రద ఈసారి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. యూపీ రాజకీయాలలో ములాయం సింగ్ పార్టీ తరఫున రెండు దఫాలు ఎంపీగా పనిచేసిన జయప్రద అక్కడ పార్టీలో వర్గ పోరు మూలంగా చాలా కాలంగా సీరియస్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ నుంచి పోటీకి ఆమె రెడీ అంటున్నారు. 


అటు వైపేనా :


సినిమా నటిగా తెలుగు ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్న జయప్రద రాజకీయ నాయకురాలిగాను సక్సెస్ ఫుల్ జర్నీ చేశారు. ఆమె టీడీపీ నుంచి అరంగేట్రం చేసినా చంద్రబాబు తగిన పొజిషన్ ఇవ్వలేదన్న ఆవేదనతో ఆ పార్టీ నుంచి తప్పుకుని ములాయం పార్టీలో చేరారు. ఇపుడు ఆమె కనుక తిరిగి ఎంట్రీ ఇస్తే వైసీపీ వైపు నుంచే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. జగన్ సైతం జయప్రదను పార్టీలోకి తీసుకునే విషయంలో సుముఖంగా ఉన్నారని అంటున్నారు.


ఇప్పటికే టీడీపీలో సినీ గ్లామర్ ఎక్కువగా ఉంది. వైసీపీ కూడా ఆ లోటును పూడ్చుకునేందుకు ట్రై చేస్తోంది. మంచి వక్తగానే కాదు, పుష్కలంగా గ్లామర్ ఉన్న జయప్రద వస్తే వైసీపీకి ఫుల్ జోష్ వచ్చినట్లేనని భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: