ప్ర‌జ‌ల్లోంచి వ‌చ్చిన మ‌నిషిగా రాజ‌కీయ దృఢ సంక‌ల్పం క‌లిగిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 1999న అక్టోబ‌ర్ 13న భార‌త ప్ర‌ధానిగా రెండ‌వ ప‌ర్యాయం బాధ్య‌త‌లు చేప‌ట్టి కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌య‌న్స్‌ కు నాయ‌క‌త్వం వ‌హించారు. అంత‌కుముందు 1966లో స్వ‌ల్ప‌కాలంపాటు ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ఉన్నారు. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌గా నాలుగు ద‌శాబ్దాల‌పాటు ఆయ‌న జీవితం సాగింది. శ్రీ వాజ్‌పేయి లోక్‌స‌భ‌కు తొమ్మిదిసార్లు, రాజ్య‌స‌భ‌కు రెండుసార్లు ఎన్నికై రికార్డు నెల‌కొల్పారు. 

Image result for అటల్‌ బిహారీ వాజ్‌పేయి

భార‌త ప్ర‌ధానిగా, విదేశాంగ మంత్రిగా పార్ల‌మెంట్‌కు చెందిన వివిధ ముఖ్య‌మైన స్థాయి సంఘాల‌కు ఛైర్ ప‌ర్స‌న్‌గా, స్వాతంత్రానంత‌ర భార‌త దేశీయ‌, విదేశాంగ విధానానికి ఒక స‌మ‌గ్రమైన‌, స్ప‌ష్ట‌మైన‌, అర్థ‌వంత‌మైన రూపాన్ని ఇవ్వ‌డంలో వాజ్‌పేయి క్రియాశీలక పాత్ర పోషించారు. భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 


కాగా వాజ్‌పేయి ఆరోగ్యం ఈ రోజు మరింత క్షీణించడంతో బీజేపీ తన అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. దాంతో  రేపు జరగాల్సిన విజయవాడ బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వాజ్‌పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించారు.   ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: