ఒకే వారం లో అల్లు అరవిందు  నిర్మించిన  గీత గోవిందం మరియు దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా రిలీజ్ అయ్యింది అయితే ఇక్కడే సమస్య మొదలైంది థియేటర్స్  విషయం లో....  అయితే దిల్ రాజు సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు కాబట్టి దిల్ రాజు థియేటర్స్ ఇవ్వడం లేదంటా..!  ఈ సినిమా హిట్ కాకపోయినా, షేర్ అయితే వస్తోంది. సహజంగా ఏ నిర్మాతకైనా ఇలాంటి టైమ్ లో హాలీడే వస్తూంది అంటే ఓ ఆశ వుంటుంది. మరికాస్త రికవరీ అవుతుందేమో? అని. అలాంటపుడు థియేటర్లు ఎలా ఖాళీ చేస్తారు. ఈరోజు కూడా క్రాస్ రోడ్స్ లో మంచి కలెక్షన్లే నమోదు అయ్యాయి.

Image result for dil raju

పైగా దిల్ రాజు చేతిలో జంటనగరాల థియేటర్లు లేవు. ఇక్కడ హవా అంతా ఆసియన్ సునీల్ ది. అయితే దిల్ రాజు తన సినిమా తీసేస్తే గీత గోవిందం వేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్రగడ్డ ప్రాంతంలో రెండు మాస్ థియేటర్లు గోకుల్, శ్రీరాములు రెండింట్లో శ్రీనివాస కళ్యాణం వుంది. ఈ రెండింటిలో ఒకటి ఇమ్మని అడిగారు. కానీ దిల్ రాజు నో అన్నారు. కావాలంటే ఆగస్టు 15 హాలీడే అయిపోయిన తరువాత ఇస్తాను అన్నట్లు బోగట్టా. దీనివల్ల అక్కడే ప్లేస్ దొరకలేదు.

Image result for allu aravind

అది వదిలేస్తే ఆంధ్ర అంతటా దిల్ రాజు ప్లస్ అల్లు అరవింద్ ప్లస్ యువి కలిపే ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు. గీతగోవిందం ఈస్ట్ లో ఈ ముగ్గురు కలిసే విడుదల చేసారు. అందువల్ల దిల్ రాజు కోరి థియేటర్లు ఇవ్వకపోవడం అన్నది మరీ సీరియస్ ఇస్యూ అని అనుకోవడానికి లేదు. నిజానికి ఇదే పరిస్థితిలో అల్లు అరవింద్ వుంటారనుకుందాం. ఆయన మాత్రం తన సినిమాను అర్థాంతరంగా తీసేస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: