రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటించిన సంగతీ తెలిసిందే. ఒక సభలో కేసీఆర్ సర్కార్ మీద విరుచుకు పడ్డాడు కుటుంబ పాలన అంటూ ఎద్దేవా చేసాడు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ కూడా కుటుంబ పాలనా నుంచే వచ్చాడు కదా..! చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ వారసత్వ పార్టీ. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆ తరువాత ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తరువాత రాజీవ్‌ గాంధీ. మధ్య మధ్య ఇతరులు ప్రధానులైనప్పటికీ ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది ప్రధానులు కావడంతో కుటుంబ పాలన అనే విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.

Image result for rahul gandhi

రాజీవ్‌ గాంధీ భార్య సోనియాగాంధీ 'విదేశీయత' అడ్డురాకపోయుంటే ప్రధాని అయ్యేవారే. అయినప్పటికీ మన్మోహన్‌ సింగ్‌ను పదేళ్లపాటు డమ్మీ ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టి తానే పరోక్షంగా పాలన కొనసాగించారు. నిజానికి నెహ్రూ-గాంధీ కుటుంబానిది దీన్ని కుటుంబ పాలన అనడంకంటే వారసత్వ పాలన అనడం కరెక్టు. ఇక పార్టీపరంగా చూసుకుంటే కాంగ్రెసు పార్టీ ఇప్పటివరకు పూర్తిగా నెహ్రూ-గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంది.

Image result for kcr

సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒకే కుటుంబం గుప్పిట్లో ఉంటాయి. కాని కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ పార్టీలా ఒకే కుటుంబం ఆస్తిగా మారింది.  ఇక కేసీఆర్‌ విషయానికొస్తే దీన్ని కచ్చితంగా కుటుంబ పాలనగా చెప్పుకోవచ్చు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్‌రావు మంత్రులు. కూతురు కవిత ఎంపీ. ఆమె ప్రభుత్వంలో లేకపోయినా కీలకపాత్ర పోషిస్తోందని చెప్పొచ్చు. ప్రభుత్వంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం కుటుంబ పాలనే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: