ఏపీలో రాజకీయాన్ని సానుకూలం చెసుకునేందుకు జగన్ మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పటికి పది జిల్లాలు పూర్తి చేసుకుంది. ఇపుడు విశాఖలో సాగుతోంది. మంగళవారం విశాఖలో పాదం మోపిన జగన్ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను కలియ తిరిగేందుకు మ్యాప్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలలో అతి కీకలం కానున్న ఈ మూడు జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ అధినేత అందుకు తగిన కార్యాచరణతో సన్నధ్ధంగా ఉన్నారు.


సెంటిమెంట్ తోనేనా :


ఏ రాజకీయ పార్టీ అయినా ఉత్తరాంధ్ర నుంచే తన ఎన్నికల సమరాన్ని ప్రారంభిస్తుంది. జగన్ పాదయత్ర కడప జిల్లా నుంచి మొదలై ఉత్తరాంధ్రతో ముగియనుంది.  షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్  తో పూర్తి కావాలి. కానీ లేటెస్ట్ గా పార్టీ వర్గాల భోగట్టా ఏంటంటే ఈ ఏడాది డిసెంబర్ వరకూ జగన్ ఉత్తరాంధ్రలోనే ఉంటారట. సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళ నుంచి సమర శంఖం పూరించడం ద్వారా కొత్త ఏడాది ఎన్నికలకు సై అంటారట.


వ్యూహాత్మకమే :


జగన్ పాదయాత్ర నెమ్మదిగా సాగడం వ్యూహాత్మకమేనంటున్నారు. విశాఖలో తొలి రోజు ఆయన పదకొండు కిలోమీటర్లు నడిచారు. ఆగస్ట్ 15 విరామం ప్రకటించారు. గురువారం కొద్ది సేపు నడచి హైదరాబాద్ కి బయల్దేరి వెల్తారు. తిరిగి శనివారం నర్శీపట్నం వస్తారు. ఇక ఆ రోజు నుంచే జగన్ విశాఖ జిల్లా పాదయత్ర మెల్లగా మొదలవుతుంది. ఇలా ప్రతి అసెంబ్లీ సెగ్మంట్లోనూ కనీసంగా నలుగైదు  రోజుల  పాటు ఉండేలా జగన్  ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి మూడు జిల్లాలలో పాదయాత్రను అయిదు నెలల పాటు చెయాలన్నది జగన్ ఆలొచనంగా ఉంది.

ఇదీ కారణం :


జగన్ పాదయత్ర మొదలుపెట్టినపుడు ఏపీలో ముందస్తు హడావుడి బాగా ఉంది. అప్పట్లో టీడీపీ, బీజేపీ దోస్తీ కూడా ఓ లెక్కలో ఉంది. మారిన పరిస్థితులలో  కేంద్రంతో  కటీఫ్ అన్న బాబు ముందస్తు కు కూడా నో అంటున్నారు. దాంతో జగన్ కూడా స్ట్రాటజీ మార్చారు. నెమ్మదిగా పాదయాత్ర చేసుకుంటూ జనంలో రాజకీయ వేడి తగ్గకుండా చూడాలనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: