ప్రపంచంలో రోజు రోజుకీ ఉగ్రవాదం ప్రభలిపోతుంది.  అమాయక ప్రాణాలే వారి టార్గెట్..లక్ష్యం ఏదైనా నిండు ప్రాణాలు కోల్పోతూ అనాధలుగా, అంగవైకల్యులుగా మిగిలి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నవారు లక్షల్లో ఉన్నారు.  తాజాగా కాబూల్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  టీచర్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలోనే విద్యాసంస్థలో ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులలో చాలా మంది టీనేజి విద్యార్థులేనని భావిస్తున్నారు.
Image result for suicide bomber
యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల కోసం వారంతా ట్యూషన్ కోసం వచ్చినవారు.   రక్తపు మడుగులో మాంసం ముద్దలు, తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో 67 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గానిస్థాన్‌లోని షియా వర్గం మీద ఇస్లామిక్ స్టేట్ దళాలకు చెందిన సున్నీ ముస్లిం తీవ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు.
Image result for suicide bomber
షియా సంప్రదాయం ఇస్లాం మతానికి విరుద్ధమైనదని వారు వాదిస్తుంటారు. ఎటుచూసినా తెగిపడిన విద్యార్థుల అవయవాలు, మాంసం ముద్దలే. బాధితుల ఆర్తనాదాలతో హృదయవిదారకంగా మారింది. కొందరు ఏం జరుగుతోందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆ విద్యా సంస్థ లోపల ఆత్మాహుతికి సిద్ధపడిన వ్యక్తి తనను తాను పేల్చుకోవడం జరిగింది" అని పోలీసు అధికార ప్రతినిధి హష్మత్ స్టానిక్‌జాయ్ చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తాసంస్థ తెలిపింది



మరింత సమాచారం తెలుసుకోండి: