మంత్రి నారా లోకేష్  ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. మంత్రి హోదాలో జెండా వంద‌నం చేయ‌టంలో  త‌ప్పేమీలేదు.   కానీ మంత్రి హోదాలో ఉండి, అది కూడా ఇంటి మేడ మీదే జెండా వంద‌నం  చేయ‌టం క‌చ్చితంగా త‌ప్పనే అంటున్నారు అంద‌రూ. ఇంటి ముందు ప్రాంగ‌ణంలోనే జెండా ఎగుర‌వేయ‌వ‌చ్చు. లేదా స‌చివాల‌యంలో జ‌రిగే జెండా పండుగ‌కు హాజ‌రు కావ‌చ్చు.  అతీ  కాక‌పోతే రాష్ట్ర‌పార్టీ కార్యాల‌యంలో కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అటువంటిది అన్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసి ఇంట్లో మేద‌మీదే అదికూడా భార్య నారా బ్రాహ్మ‌ణి, కొడుకు దేవాన్ష్ తో క‌లిసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తూ   జెండా వంద‌నం చేయ‌టం వివాదాస్ప‌ద‌మైంది.

బ్రాహ్మ‌ణి హోదా ఏమిటి ?


ఇంటి మేడ‌మీదే జెండా వంద‌నం చేయ‌టాన్ని అంద‌రూ త‌ప్పు ప‌డుతున్న స‌మ‌యంలోనే త‌న భార్య బ్రాహ్మ‌ణి  పోలీసు గౌర‌వ వంద‌నం స్వీక‌రించ‌టం ఇంకా త‌ప్పైంది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్నారు కాబ‌ట్టి లోకేష్ గౌర‌వ వంద‌నం స్వీక‌రిచటంలో ఎంటువంటి త‌ప్పులేదు. కానీ బ్రాహ్మ‌ణి ఏ విధంగా పోలీసు గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తారు. ఆమెకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కోడ‌లు, మంత్రి భార్య అన్న హోదా త‌ప్ప ఇంకేమీ లేదు. ఇంత త‌ప్పు జ‌రిగినా మెజారిటీ మీడియాకు ఇవేవీ ప‌ట్ట‌లేదు. 


జ‌గ‌న్ విష‌యంలో జ‌రిగుంటేనా ?


ఇటువంటి విష‌య‌మే ఏదైనా వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విష‌యంలో జ‌రుగుంటే మీడియా వ‌దిలిపెట్టేదేనా ?  చీల్చి చెండాడేసుండేది. జ‌గ‌న్ కానీ ఇంకెవ‌రైనా నేత‌లు కానీ ఏదైనా త‌ప్పు  చేసుంటే దేశ‌ద్రోహానికి పాల్ప‌డినంత భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్ చేసుండేద‌న‌టంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: