మొత్తానికి ఒక విష‌యాన్ని చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించారు. అమ‌రావ‌తిలో క‌నీస సౌక‌ర్యాలు కూడా లేని కార‌ణంగానే  ఏడాదికి ఒక జిల్లాలో జెండా వంద‌నం చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు చేస‌న ప్ర‌క‌న‌ట‌తో అంద‌రూ ఒక్క‌సారిగా నివ్వెర‌పోయారు. శ్రీ‌కాకుళంలోని ప్ర‌భుత్వ డిగ్రీ కాళాశాల‌లో జెండా ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన సంద‌ర్భంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ముఖులంద‌రినీ ర‌మ్మ‌న్నారు


అమ‌రావ‌తిలో క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవ‌ని చంద్ర‌బాబు అన్న మాట‌లు ఇపుడు వైర‌ల్ గా మారాయి. ఎందుకంటే, అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసేందుకు ప్ర‌పంచంలోని ప్ర‌ముఖులంద‌రినీ ర‌మ్మంటూ ఇంత‌కాలం ఆహ్వానించిందే చంద్ర‌బాబు.  అమ‌రావ‌తిలో అస‌లంటూ అభివృద్ధి ఏం జ‌రిగింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమర్శిస్తే ఎదురుదాడి చేస్తూ ఇంత కాలం వాళ్ళ నోళ్లు మూయించేవారు. అమ‌రావ‌తిలో చాలా అభివృద్ధి జ‌రుగుతున్న ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం క‌న‌బడటం లేదంటూ మండిప‌డేవారు.

ఆవులు, బర్రెలు తోలుకొచ్చిన చింత‌మ‌నేని

Related image

గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో అమ‌రావ‌తి అంటే అసెంబ్లీ, స‌చివాయంకు క‌ట్టిన తాత్కాలిక నాసిర‌కం నిర్మాణాలు త‌ప్ప ఇంకేమీ క‌న‌బ‌డ‌దు. అక్క‌డ ఎటువంటి అభివృద్ధి జ‌ర‌గ‌టం లేద‌నే ఆమ‌ధ్య జ‌రిగిన  అసెంబ్లీ స‌మావేశాల్లో టిడిపి దెందులూరు ఎంఎల్ఏ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఏకంగా ఆవులు, బ‌ర్రెల‌ను  తోలుకొచ్చి అసెంబ్లీ భ‌వ‌నాల వెనుక క‌ట్టేయ‌టం అప్ప‌ట్లో అదోపెద్ద సంచ‌ల‌నమైంది.  అటువంటిది  అమ‌రావ‌తిలో జెండా ఎగుర‌వేయ‌టానికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు కూడా లేవని చంద్ర‌బాబే ఒప్పుకున్నారంటే ఏమిట‌ర్ధం ?  


మరింత సమాచారం తెలుసుకోండి: