పవన్ కళ్యాణ్ తిరుగులేని ఇమేజ్ ఉన్న సినిమా హీరో. ఆయన ఏంచేసినా  పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి  పవన్ రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీ పెట్టారు. ఆయతో పాటే అనుకున్న వారంతా అక్కడా వచ్చి చేరారు. నిష్కల్మషమైన ప్రేమతో పార్టీని ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చారు. ఇపుడు అలాంటి వాళ్ళకి గట్టి  షాక్ తగిలింది.


వాళ్ళకే పెద్ద పీట :


పవన్ జనసేనలో ప్రజారాజ్యం మాజీ నాయకులకే పెద్ద పీట వేస్తున్నారని అసలైన ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. తాము పవన్ కోసం, ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, అయినా పార్టీ పదవులు మాత్రం మాజీలకే దక్కుతున్నాయని అంటున్నారు. ఈ మధ్య పవన్ ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు బాధ్యులను నియమించారు. వీరిలో ప్రజారాజ్యంలో పనిచేసిన వారే ఎక్కువగా ఉండడంతో జనసైనికులకు దిమ్మ తిరిగిందట.


అది కరెక్టేనా :


పవన్ పార్టీపై టీడీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలు తరచూ  అంటున్నట్లుగా అది ప్రజా రాజ్యం టూ గానే ఉందా. మరి, అదే విమర్శ ఇపుడు పవన్ ఫ్యాన్స్ నుంచి కూడా వస్తోంది. పైగా ఈ పార్టీ పదవులు అన్నీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడంపైనా రచ్చ అవుతోంది. కుల మతాలకు తాను అతీతం అని చెప్పే పవన్ సొంత పార్టీలో ఇలా చెయడమేంటన్న ప్రశ్నను జనసైనికులే వేస్తున్నారు.


కోటరీ ఉందా :


ఇక పవన్ చుట్టూ ఓ బలమైన కోటరీ ఉందని, వారే అక్కడ అంతా అన్నట్లుగా పరిస్థితి ఉందని ప్రచారమూ ఉంది. ఇపుడు పవన్ ఫ్యాన్స్, అసలైన జనసైనికులను ఆ కోటరీయే అడ్డుకుంటోందట. అంటే పవన్ కి, బయట ప్రపంచానికి మధ్య ఓ ఇనుప తెరలా ఈ కోటరీ పనిచేస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే పవన్ పార్టీకి  చాలా రిపేర్లే చేసుకోవాలి. జనసేన పార్టీని ఏపీలో మూడవ ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్న టైంలో జనసేనలో రేగిన ఈ చిచ్చుని అధినేత వెంటనే ఆపేందుకు యాక్షన్ తీసుకోవాలంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: